వామ్మో.. ఆ గుహ‌నిండా ఎముక‌లే.. అస‌లు విష‌యం ఏంటంటే..?

హైనాల గురించి చాలా మందికి తెలియదు.అవి కూడా అచ్చం తోడేళ్లలానే ఉంటూ మిగతా జంతువులను వేటాడుతుంటాయి.

 Oh My God Bone From That Cave What Is The Real Thing-TeluguStop.com

కాగా ఇలా హైనాలు మాంసాహార ప్రియులని తెలుస్తోంది.మాంసం కోసం హైనాలు ఎంతటి సాహసానికైనా ఒడిగడుతాయని చాలా మంది చెబుతారు.

హైనాలు ఎంత ప్రమాద కర మైనవో తెలిపేలా సౌదీ అరేబియాలో పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు ఏడు వేల సంవత్సరాల నాటి హైనాల స్థావరాన్ని కనుగొన్నారు.ఈ స్థావరాన్ని చూసిన శాస్త్రవేత్తలకు అవి చేసిన పనిని చూసి ఒక్క సారిగా దిమ్మ తిరిగిపోయింది.

 Oh My God Bone From That Cave What Is The Real Thing-వామ్మో.. ఆ గుహ‌నిండా ఎముక‌లే.. అస‌లు విష‌యం ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ గుహలో ఏముందనే సందేహం అందరిలోనూ కలగకమానదు.

ఇలా శాస్త్రవేత్తలు శోధించి కనుక్కొన్న ఈ గుహలో మొత్తం ఎముకలతో నిండిపోవడం చూసిన వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఈ గుహలో దాదాపు 40 రకాల ప్రాణుల ఎముకలు బయటపడ్డాయి.ఇలా బయట పడ్డ ఎముకల్లో కేవలం వన్య ప్రాణులవే కాకుండా మనుషులవి కూడా ఉండడం గమనార్హం.

అంతే కాకుండా గుర్రాలు, ఒంటెల వంటి జంతువులను కూడా ఈ హైనాలు వేటాడడం షాక్ కు గురి చేసింది.అలాగే గాడిదలు, మేకలు, జింకల ఎముకలు కూడా లభ్యమయ్యాయి.

ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే… ఈ గుహలో ఉన్న ఎముకల్లో హైనాల ఎముకలు కూడా లభ్యమయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

Telugu 1917 Bones Available, Animals Bones, Cave, Found, Hyenas Den, Saudi Arabia, Scientists, Seven Thousand Years Old Hyenas Den-Latest News - Telugu

కాగా ఈ గుహలో హైనాలు చంపి తీసుకొచ్చి జంతువులను తినడంతో పాటు వివిధ స్మశాన వాటికల్లో ఉన్న మనుషుల కళేబరాలను కూడా ఇక్కడకు లాక్కొని వచ్చి ఆరగించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతానికి ఈ గుహనుంచి పరిశోధనల నిమిత్తం 1,917 ఎముకలు బయటకు తీశారు.13 శాంపిళ్లను రేడియో కార్బన్‌ డేటింగ్‌ టెస్ట్‌ చేయగా… మరిన్ని విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి.ఇలా లభించిన ఎముకల్లో కొన్ని దాదాపు ఏడు వేల ఏళ్ల నాటివని తెలుస్తోంది.

#Animals Bones #Hyenas #Bones #Saudi Arabia #Cave

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు