వామ్మో 365 రకాల వంటకాలా... ఈ గోదారోళ్ల మర్యాదలు తట్టుకోవడం కష్టమండీ బాబు..

గోదారోళ్ల మర్యాదలు చూస్తే ముక్కున వేలేసుకునేలా ఉంటాయి.ఇక్కడి వాళ్లు చేసే మర్యాదలను ప్రపంచంలో ఉన్న వేరే ఎవరూ చేయరంటే అతిశయోక్తి కాదు.

 Oh My God 365 Types Of Recipes  It Is Difficult To Tolerate The Manners Of These-TeluguStop.com

అలా ఉంటాయి గోదావరి ప్రాంతం వారి మర్యాదలు.ఇప్పుడు గోదావరి వారు చేసిన మర్యాదలకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

సంక్రాంతి అంటేనే సరదాల పండుగ.ఈ పండుక్కి ఇంటికి కొత్త అల్లుళ్లు వస్తే ఎలా ఉంటుందో ఎటువంటి మర్యాదలు చేస్తారో ఈ ఫొటోలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది.

ఇంతకీ ఈ మర్యాదలు ఎక్కడ జరిగాయంటే.

సంక్రాంతి అంటేనే ఫుల్ జోష్.

అటువంటిది తెలంగాణ కంటే ఆంధ్రాలో ఈ పండుగ హైప్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఈ పండక్కి ఎక్కడ ఉన్న వారైనా సరే తమ సొంతూరికి వస్తుంటారు.

ఆంధ్రా వారు హైదరాబాద్ లో ఉన్నా అమెరికాలో ఉన్నా కానీ సంక్రాంతి సందడిని మాత్రం మిస్ చేసుకోరు. సంక్రాంతికి ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పంద్యాల పోటీలు పీక్స్లో ఉంటాయి.

కాసేపు కోడి పంద్యాల విషయాన్ని పక్కకు పెడితే.ఇక గోదావరి ప్రాంతం వారి మర్యాద వామ్మో మనం తట్టుకోలేనంతగా ఉంటుంది.

ఇక సంక్రాంతికి తమ ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లకు వారు చేసే మర్యాదలు ఓ రకంగా ఉంటాయి.ఈ సంక్రాంతికి నరసాపురానికి చెందిన ఓ వ్యక్తి తన మనవరాలికి, ఆమెకు కాబోయే ఫియాన్సీకి ఇచ్చిన విందు భోజనం వైరల్ గా మారింది.

ఆ తాత తన మనువరాలికి మరియు ఆమెకు కాబోయే భర్తకు దాదాపు 365 రకాల వంటకాలను వండి పెట్టాడు.ఈ వంటకాలతో డైనింగ్ టేబుల్ మొత్తం నిండిపోయింది.దద్దోజనం, పులిహోర, బిర్యానీలతో పాటుగా 35 రకాల కూరలను కూడా వండిపెట్టారు.35 రకాల బిస్కెట్లు, 15 రకాల ఐస్ క్రీంలు, 15 రకాల కేకులను వండి పెట్టారు.

Oh My God 365 Types Of Recipes It Is Difficult To Tolerate The Manners Of These Godaros , 365 Types Recipes, Viral News - Telugu Types Recipes, Godtypes

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube