అయ్యయ్యో: నది ఏంటి ఇలా నల్లగా మారిపోయింది..!?

సాధారణంగా నదిలో కానీ, సముద్రంలో కానీ నీరు నీలం రంగులో గాని, లేదా తెలుపు రంగులో గాని ఉంటుంది.అయితే కొన్ని ప్రదేశాల్లో అక్కడ ప్రత్యేకతను బట్టి వేరు వేరు రంగులోనూ నీటి ప్రవాహం ఉండడం మనం చూసే ఉంటాం.

 Oh God Why Arunachal Pradesh Kameng River Turns Into Black , River, Truns, Black-TeluguStop.com

అయితే నదిలో కాని, సముద్రములో కాని ఎన్నో జల జీవరాసులు ఉంటాయి.ముఖ్యంగా చేపలు, షార్కులు, తిమింగలాలు, తాబేలు, కప్పలు లాంటి ప్రాణులు ఉంటాయి.

అయితే ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే కాలుష్య కారకాలు, కెమికల్స్ ను ఎక్కువగా నదుల్లోకి లేదా సముద్రం లోకి వదిలేస్తూ ఉంటారు.ఇలా నద్దుల్లోకి లేదా సముద్రంలోకి కాలుష్య కారకాలను విడుదల చేయడం వల్ల సమస్త జీవరాశులు నీటిలోనే చనిపోతూ ఉంటాయి.

ఫ్యాక్టరీల నుండి విడుదలైన కెమికల్స్ కలిసి చేపలు చనిపోవడం లాంటి సంఘటనలు మనం చూసే ఉంటాము.కొన్నివేల చేపలు చనిపోయి కుప్పలుతెప్పలుగా సముద్రం లేదా నది ఒడ్డుకు కొట్టుకు రావడం చూసే ఉంటాం.

అయితే ఇలాంటి ఘటనే మళ్లీ ఇప్పుడు చోటుచేసుకుంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని కామెంగ్ నదిలో ఆకస్మాత్తుగా నీలి రంగులో ఉన్న నీళ్ళు కాస్త నలుపురంగులోకి మారి వేలాది చేపలు చనిపోయిన ఘటన చోటు చేసుకుంది.

Telugu Black, Chemicals, China Projects, Fishes, Kameng River, Latest, River, Tr

ఇలా నది లోని నీళ్లు రంగు మారడానికి, చేపలు చనిపోవడానికి గల కారణం భారీ స్థాయిలో కాలుష్య కారకాలు కలవడం వల్లనే.సాధారణంగా నదిలో కలిసి కరిగే వ్యర్ధాల పరిమాణం లీటర్ కి 300- 1200 మిల్లీ గ్రాములు ఉండాలి.కానీ ఇది కామింగ్ నదిలో మాత్రం 6,800 మిల్లీగ్రాములు ఉన్నట్లు తేలింది.దీనివల్లనే నదిలోని నీరు నలుపు రంగుగా మారిపోయి చేపలు చనిపోయాయని అధికారులు గుర్తించారు.కాలుష్యానికి కారణం పొరుగు దేశం అయిన చైనా చేపట్టిన భారీ నిర్మాణాలు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube