వామ్మో.. బతికున్న పామును ఇలా తిన్నాడు ఏంటి!

సోషల్ మీడియా పుణ్యమాని టాలెంటెడ్ పీపుల్‌కు అవకాశాలు వచ్చిన సంగతి మనకు తెలుసు.అయితే, ఇదే సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకునేందుకుగాను కొందరు వికృతమైన పనులు చేస్తున్నారు.

 Oh God How Did He Ate The Living Snake Eat Like This, Snake, Viral, Sajid, Hyder-TeluguStop.com

ఈ క్రమంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు.తాజాగా ఈ కోవకు చెందిన పని ఒకటి చేశాడు ఓ యువకుడు.

అది చూసి పోలీసులు స్పందించారు.ఇంతకీ సదరు యువకుడు ఏం చేశాడంటే…

తెలంగాణలోని హైదరాబాద్, పాతబస్తీకి చెందిన ఓ యువకుడు ఎలాగైనా బాగా పాపులర్ కావాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ పిచ్చిపని చేశాడు.అదేంటంటే.

సోషల్ మీడియాలో క్రేజ్ పొండంతో పాటు తాను చేయబోయే పని వైరల్ కావాలనుకున్నాడు.ఏకంగా బతికున్న ఓ పాము పిల్లను తన నోటిలో పెట్టుకున్నాడు.అంతటితో ఆగలేదు.నార్మల్ గానే అన్నం తిన్నట్లుగా పాము తలను నోట్లో పెట్టుకుని కొరుకుతూ పాము పిల్ల మొత్తాన్ని కరకర కొరుకుతూ నమిలి మింగాడు.ఇదంతా కూడా వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.ఆ వీడియో ప్రజెంట్ వైరల్ అవుతోంది.

పాము పిల్లను అలా తినేయడం చూసి సదరు యువకుడి వద్దనున్న వారు కూడా భయపడిపోయారు.

Telugu Animallovers, Ate Live Snatke, Hyderabad, Paatabasthi, Sajid, Snake, Craz

ఆ యువకుడి పేరు సాజిద్ అని తెలుస్తోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి జంతు ప్రేమికులు అతడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సదరు యువకుడిపై తగు చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డీజీపీకి ఫిర్యాదు చేశారు.

ఫారెస్ట్స్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఈ మేరకు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారి ట్వీట్‌పై హైదరాబాద్ పోలీస్ విభాగం వారు స్పందించారు.యువకుడి లొకేషన్, ఇతర డీటెయిల్స్‌ను తెలపాలని కోరారు.

సోషల్ మీడియాలో క్రేజ్ పొందడం కోసం ఇలాంటి పనులకు పూనుకోవడం పిచ్చిపనేనని నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube