తెలంగాణా ఎన్నారైలకి గుడ్ న్యూస్...!!!!

అమెరికాలో ఉంటున్న తెలంగాణా వాసులు ఎన్నాళ్ళ నుంచో ఎన్నారై పాలసీ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి పలు మార్లు వినతులు ఇస్తూనే ఉన్నారు.కాగా పలు మార్లు ఎన్నారై సంఘాలు సైతం తెలంగాణాలో కేసీఆర్, కేటీఆర్ లని పలు మార్లు కలిసి పాలసీపై ఎన్నో సార్లు నివేదికలు కూడా సమర్పించారు.

దాంతో వారి వినతులని పరిశీలించిన ప్రభుత్వం సమగ్ర ఎన్నారై విధానాన్ని రూపొందించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎన్నారై విధాన రూపకల్పన కి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలకి చెందిన ఎన్నారై పాలసీ విధానాలని తెలుసుకోవాలని తెలంగాణా అధికారులకి ఆదేశాలు జారీ చేయడంతో ఆ బృందం అధ్యయనం మొదలు పెట్టింది.కేసీఆర్ ఆదేశాలతో సీనియర్ అధికారులు బృందం కేరళా రాష్ట్రం పర్యటిస్తోంది.

ఈ బృందంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ , సీఎస్ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు కూడా ఉన్నారు.
కేరళలో గల తిరువనంతపురం లో ప్రవాస కేరళీయుల సంక్షేమ వ్యవహారాల శాఖ అధికారులతో భేటీ అయిన తెలంగాణా అధికారులు, వారి ప్రజల కోసం తీసుకుంటున్న సంక్షేమ చర్యలు, వాటి విధి విధాలని అడిగి తెలుసుకున్నారు.

విదేశాలకి వెళ్ళే ఆ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube