ఆర్ఆర్ఆర్ ఆ రెండు డేట్స్ లో రిలీజ్ కాకపోతే ఓటీటీకి ఇచ్చేస్తావా మావ.. నెట్టింట్లో మీమ్స్ వైరల్!

ఆర్ఆర్ఆర్  విడుదల తేదీ విషయంలో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే చివరికి అనుకున్నదే జరిగింది.

 Official Statement Rrr Release Date Fix Rrr, Ntr , Ram Charan, Rajamouli, Aliabhatt, Ajay Devgan-TeluguStop.com

సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలనే నిజం చేస్తూ ఆర్ఆర్ఆర్ సినిమాను ఏప్రిల్ చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు.అయితే రాజమౌళి 2 రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేయడం విశేషం.

కరోనా మహమ్మారి పరిస్థితులను బట్టి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.ఈ నేపథ్యంలోనే తాజాగా చెర్రీ, తారక్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

 Official Statement Rrr Release Date Fix Rrr, Ntr , Ram Charan, Rajamouli, Aliabhatt, Ajay Devgan-ఆర్ఆర్ఆర్ ఆ రెండు డేట్స్ లో రిలీజ్ కాకపోతే ఓటీటీకి ఇచ్చేస్తావా మావ.. నెట్టింట్లో మీమ్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చి 18వ తేదీ కానీ, ఏప్రిల్ 28వ తేదీ కానీ విడుదల చేస్తామని అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చారు రాజమౌళి.అప్పటికి కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి పరిస్థితులు అనుకూలిస్తే, అదేవిధంగా థియేటర్లు పూర్తిస్థాయి ఆక్యుపెన్సీ తో తెరుచుకుంటే మార్చి 18వ తేదీన విడుదల చేస్తామని ఒకవేళ అలా జరగకుంటే ఎలాంటి పరిస్థితులు ఉన్న కూడా ఏప్రిల్ 28న ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తాము అని దర్శక ధీరుడు రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో రూపొందించారు.

Telugu Rajamouli, Ram Charan-Movie

ఈ సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య సమర్పణలో రూపొందించారు.ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఇందులో ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్ లుగా నటించారు.

ఇకపోతే రాజమౌళి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తామని ప్రకటించారు.అయితే ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ఆ రెండు డేట్స్ లో సినిమా రిలీజ్ కాకపోతే ఓటిటికి ఇచ్చేస్తా మావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube