అమెరికా రాష్ట్రంలో దీపావళికి అధికారక గుర్తింపు...!!

అగ్ర రాజ్యం అమెరికాలో దీపావళి ని జాతీయ పండుగగా గుర్తించాలని ఎంతో కాలంగా భారతీయులు అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఈ క్రమంలోనే అమెరికా ప్రతినిధుల సభ్యురాలు కెరోలిన్ చట్టసభలో ఓ కొత్త బిల్లు ప్రవేశపెట్టారు.

 Official Recognition Of Diwali In The State Of America ,  America , Diwali , Raj-TeluguStop.com

ఆమె తో పాటు భారత సంతతి వ్యక్తి పారిశ్రామిక, రాజకీయ వేత్త అయిన రాజా కృష్ణ మూర్తి, విదేశీ వ్యవహారా కమిటీ ఛైర్మెన్ గ్రెగరీ కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపారు.ఈ బిల్లును ప్రతిపాదించడానికి గర్వ పడుతున్నాను ఎందుకంటే భారతీయలు అమెరికా అభివృద్దికి ఎంతో దోహద పడుతున్నారు, వారి సేవలకు గుర్తింపుగా ఈ బిల్లు తప్పకుండా నెగ్గాలని ఆమె కోరారు.

ఈ బిల్లు గనుకా చట్ట రూపం దాల్చితే ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు దీపావళిని సెలవు దినంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలాఉంటే దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్న క్రమంలో అమెరికాలో మిచిగాన్ రాష్ట్రంలోని భారత ఎన్నారైలు అందరూ అక్కడి ప్రభుత్వానికి దీపావళి పండుగకు గుర్తింపు ఇవ్వాలని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.

దాంతో మిచిగాన్ రాష్ట్ర సెనేట్ దీపావళి పండుగకు అధికారిక గుర్తింపు ఇచ్చిందని అక్కడి భారత సంతతి ఎన్నారైలు ఓ ప్రకటనలో తెలిపారు.సెనేటర్ జిమ్ రన్ స్టడ్ ఈ తీర్మానాన్ని సెనేట్ లో ప్రతిపాదించారు.

అందుకు మరో సెనేటర్ డేటా పోల్ మద్దతుగా నిలిచారు.దాంతో నిన్నటి సాయంత్రం సెనేట్ హౌస్ ఈ తీర్మానానికి ఆమోదం తెలిపిందని తెలుస్తోంది.

మిచిగాన్ స్టేట్ దీపావళికి అధికారిక గుర్తింపు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని మిచిగాన్ సెనేట్ కు ఎన్నారైలు కృతజ్ఞతలు తెలిపారు.అక్కడి చట్ట సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

ఇదిలాఉంటే కేవలం అమెరికాలో మాత్రమే కాదు భారతీయులు ఏ దేశంలో ఉన్నా దీపావళిని అధికారిక పండుగగా గుర్తించాలని కోరుతూ తీర్మానాలు పెట్టి ఆమోదింప చేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube