అఫీషియల్ : ఎన్టీఆర్ 30.. కొరటాల శివ ఫిక్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ అయ్యింది.ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ కాంబోలో సినిమా వస్తుంది.

 Official Ntr 30 Koratala Siva Directorial 30-TeluguStop.com

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఈ సినిమాను మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు.ఆల్రెడీ జనతా గ్యారేజ్ సినిమా చేసిన ఈ కాంబో మరో క్రేజీ సినిమాకు సిద్ధమైంది.

అయితే లాస్ట్ టైం రిపేర్లు చేయగ ఈసారి బౌండరీస్ దాటి వెళ్తున్నాం అంటూ కొరటాల శివ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు.దీన్ని బట్టి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుందని అనుకోవచ్చు.

 Official Ntr 30 Koratala Siva Directorial 30-అఫీషియల్ : ఎన్టీఆర్ 30.. కొరటాల శివ ఫిక్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా ఉంది.ఆ సినిమా పూర్తయ్యాక తారక్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఎన్.టి.ఆర్ కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఎన్.టి.ఆర్, కొరటాల శివ తాము కమిటైన సినిమాలు పూర్తి చేసి కలిసి పనిచేయనున్నారు.  ఆర్.ఆర్.ఆర్ తో ఎలాగు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకునే తారక్ కొరటాల శివ సినిమాతో మరింత పాపులారిటీ తెచ్చుకుంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈసారి ఈ ఇద్దరు కలిసి ఏ జానర్ సినిమా చేస్తారో చూడాలి.

#Kalyan Ram #NTR 30 #Koratala Siva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు