థియేటర్ లోనే మాస్టర్... క్లారిటీ ఇచ్చిన యూనిట్  

ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ కారణంగా చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అన్ని కూడా డిజిటల్ రిలీజ్ కి వెళ్ళిపోయాయి.ప్రముఖ ఒటీటీ చానల్స్ ద్వారా నిర్మాతలు తమ సినిమాలని రిలీజ్ చేసుకున్నారు.

TeluguStop.com - Official Clarification On Master Latest Rumors

ప్రీమియర్ రైట్స్ ని ఆయా సంస్థలకి అమ్మేసి నష్టాలు లేకుండా సేఫ్ గా బయటపడ్డారు.అక్షయ్ కుమార్, సూర్య లాంటి స్టార్ హీరోలు సైతం ఒటీటీ రిలీజ్ వైపే మొగ్గు చూపించారు.

అయితే మరల చాలా కాలం తర్వాత థియేటర్లు తిరిగి ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు.ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో థియేటర్లు ఓపెన్ చేయడానికి యజమానులు కూడా సిద్ధం అవుతున్నారు.

TeluguStop.com - థియేటర్ లోనే మాస్టర్… క్లారిటీ ఇచ్చిన యూనిట్-General-Telugu-Telugu Tollywood Photo Image

దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా సిద్ధం అవుతున్నాయి.ఈ నేపధ్యంలో పెద్ద సినిమాలు థియేటర్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

తెలుగులో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది.

ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమా చేశాడు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా తమిళ్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తుంది.

ఇక ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్లు ఒక ఫేక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరిగింది.

అయితే ఈ ఫేక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో చిత్ర నిర్మాతలు రియాక్ట్ అయ్యారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాస్టర్ మూవీ అమెజాన్ ప్రైమ్ రిలీజ్ పోస్టర్ ఫేక్ అని తేల్చేశారు.

పోస్టర్‌లో నిజం లేదని స్పష్టం చేశారు.ఇప్పటివరకూ సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ప్రస్తుతం విజయ్ సినిమాలు వరుసగా 100 కోట్లకు పైగానే రాబడుతున్నాయి.ఈ నేపథ్యంలో మాస్టర్ సినిమాను డిజిటల్‌లో రిలీజ్ చేస్తే నష్టం వస్తుందని అందుచేత ఈ చిత్రాన్ని డైరెక్ట్‌గా థియేటర్‌లోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

#OTT Release #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు