ఆ పోలీసులు చేసిన పనికి అధికారులు సీరియస్‌..!

సాధారంణగా పోలీసులు అంటే అందరికీ ఆదర్శంగా నిలవాలి.ప్రజలందరికీ ట్రాఫిక్ నిబంధనలను తెలియజేస్తూ, వారు కూడా  పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలా ఉంటుందో చెప్పండి మరి.

 Officers Serious On Three Lady Constables Travelling On Bike In Khammam-TeluguStop.com

అచ్చం అలాగే ఖమ్మంనికి చెందిన ముగ్గురు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అంతలా వారు ఏమి చేశారు అంటే.

ఆ ముగ్గురు మహిళా పోలీసులు కూడా ఒకే స్కూటీపై హెల్మెట్ లు లేకుండా రోడ్డు మీద ప్రయాణం చేశారు.అంతే  కాకుండా వారిలోని ఇద్దరూ సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వెళ్తున్నారు.

 Officers Serious On Three Lady Constables Travelling On Bike In Khammam-ఆ పోలీసులు చేసిన పనికి అధికారులు సీరియస్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బైక్ పై ప్రయాణం చేసే వారిని చూసి నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు.వారు ఖమ్మం  రైల్వేస్టేషన్‌ సమీపంలో మార్గమధ్యంలో వెళ్తుండటం చూసి కొందరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.

ఇటీవల ఖమ్మంలో జరిగిన షర్మిల సభ కోసం ఈ ముగ్గురు మహిళా పోలీసు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించేందుకు బైక్ మీద వెళ్లారు.ఈ మహిళా కానిస్టేబుల్ నిర్వహించిన నిర్లక్ష్యంపై ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌ వారియర్ సీరియస్ అవ్వడంతో పాటు, రూ.3300 జరిమానా విధించాలని, అలాగే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాడు.ఏది ఏమైనా కానీ ప్రజలకు నిబంధనలు తెలిపే పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ప్రజలకు ఒక విధంగా చనువు ఇచ్చినట్లే అనిపిస్తుంది.

#Conistable #Telangana State #YsSharmila #Khammam #3 Members

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు