ప్రతి స్టార్ హీరో కెరీర్ లో కొన్ని హిట్ సినిమాలు, కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉంటాయి.హిట్ సినిమాలను పదేపదే తలచుకునే స్టార్ హీరోలు ఫ్లాప్ సినిమా పేర్లు కూడా ఎత్తడానికి ఇష్టపడరు.
కొన్ని సినిమాలు అయితే నిర్మాతలకు భారీగా నష్టాలు తెచ్చిపెట్టడంతో పాటు అటు దర్శకనిర్మాతల పరువు కూడా తీస్తుంటాయి.అలా నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఆఫీసర్.
అక్కినేని ఫ్యాన్స్ కు కూడా ఈ సినిమా నచ్చలేదంటే ఏ స్థాయిలో సినిమా ఉందో సులభంగానే అర్థమవుతుంది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
శివ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబినేషన్ లో తెరకెక్కిన ఆఫీసర్ అటు నాగ్, ఇటు ఆర్జీవీ ఇమేజ్ లను డ్యామేజ్ చేసింది.పొంతన లేని సీన్లు, తుపాకీల సౌండ్లు, అర్థంపర్థం లేని సన్నివేశాలు సినిమా ఘోర పరాజయాన్ని చవిచూడటానికి కారణమయ్యాయి.
ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు మూడు కోట్లు మాత్రమే అంటే సినిమా ఏ స్థాయి డిజాస్టరో సులభంగా అర్థమవుతుంది.
ఆఫీసర్ సినిమాకు 1, 1.5 రేటింగులు రావడం అక్కినేని ఫ్యాన్స్ ను కూడా బాధించింది.నాగార్జున అభిమానులు సైతం ఈ సినిమా గురించి మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు.
అయితే ఊహించని విధంగా ఈ సినిమా మరోమారు వార్తల్లో నిలిచింది.వేటక్కారన్ పేరుతో తమిళంలో ఈ సినిమా విడుదల కానుంది.
తమిళ నిర్మాత ఒకరు ఈ సినిమా హక్కులు కొని రిలీజ్ చేస్తున్నారు.
తెలుగులోనే చెత్త సినిమాగా నిలిచిన ఆఫీసర్ సినిమాను తమిళంలో మళ్లీ రిలీజ్ చేయడం వల్ల ఆ నిర్మాతకు ఏం లాభం ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఆఫీసర్ తమిళంలో విడుదల కాబోతుందని తెలిసిన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు నాగార్జున పరువును అక్కడ కూడా తీస్తున్నారా.? అని కామెంట్లు చేస్తున్నారు.