హ్యాట్సాప్‌ లిఫ్ట్‌ అడిగిన బాలుడి గురించి తెలిసి ఆశ్చర్యపోయిన ఆఫీసర్‌ ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా

మన చుట్టు ఉన్న వారిలో చెడ్డ వారు, దుర్మార్ఘులతో పాటు మంచి వారు కూడా ఉన్నారు.అలాంటి మంచి వారు ఉన్నారు కనుకే మనం ఇంకా ఈ సమాజంలో బతుకుతున్నాం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 Officer Helps A Poor School Going Boy Telugustop 1 1-TeluguStop.com

చుట్టు ఉన్న వారు సాయం చేస్తే ఏదైనా సాధించవచ్చు.ఒంటరిగా సాధించేందుకు టైం పడితే జనాల సాయంతో అది వెంటనే సాధ్యం అవుతుందని కొన్ని సంఘటనలు చూస్తుంటే అర్థం అవుతుంది.

ఒక పేద కుర్రాడికి ఒక ఆఫీసర్‌ చేసిన సాయం చిన్నదే అయినా, అతడి జీవితంలో అదో పెద్ద అద్బుతం.అది అతడి జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ప్రభు తేజ అనే కుర్రాడు స్కూల్‌కు వెళ్లాలి అంటే ప్రతి రోజు మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది.అందుకే స్కూల్‌ నుండి వచ్చేప్పుడు పోయేప్పుడు ఏదో ఒక వెయికిల్‌ ను లిఫ్ట్‌ అడిగి వెళ్తూ ఉంటాడు.లిఫ్ట్‌ దొరకని రోజు సొంతంగా నడుచుకుంటూ వెళ్తాడు.

అలా తాజాగా ఒక రోజు స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డు పై నిల్చున్న ప్రభు ఒక కారును ఆపాడు.ఆ కారు ఆపి స్కూల్‌ వద్దకు ప్రభును తీసుకు వెళ్లడం జరిగింది.

హ్యాట్సాప్‌ లిఫ్ట్‌ అడిగిన బ�

కారులో ఉన్న వ్యక్తి మున్సిపల్‌ ఆఫీసర్‌.ప్రభును కుటుంబ నేపథ్యం అడిగాడు.తండ్రికి కంటి చూపు సరిగా లేదు, తల్లికి కిడ్నీల సమస్య ఒక తమ్ముడు ఉన్నాడు.అయినా కూడా స్కూల్‌పై మమకారం, చదువుపై ఆసక్తి ఉన్న ప్రభు స్కూల్‌కు వెళ్తున్నాడు.

ప్రభు పట్టుదల ఆఫీసర్‌కు బాగా నచ్చింది.అందుకే వెంటనే సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.

ప్రభుకు ఒక సైకిల్‌ కొనివ్వడంతో పాటు, అతడి తల్లికి మున్సిపల్‌ ఆఫీస్‌లో ఏదైనా పని ఇప్పించేందుకు ఒప్పుకున్నాడు.మొత్తానికి ఆ కుర్రాడి పట్టుదలతో ఆఫీసర్‌ను కదిలించాడు.

కుర్రాడికి సాయం చేసేందుకు వచ్చిన ఆ ఆఫీసర్‌కు కూడా హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube