లంచం తీసుకోను అని బోర్డు పెట్టిన నిజాయతీ ప్రభుత్వ అధికారి

తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి పై పెట్రోల్ తో ఓ రైతు దాడి చేయడం,ఆ దాడి జరిగిన దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.దీంతో తమపై ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియక భయపడుతూ విధులు నిర్వహిస్తున్నారు.

 Officer Ashok Hanging Iam Uncorrupted Board In Their Office-TeluguStop.com

వాస్తవంగా ప్రభుత్వ కార్యాలయాలల్లో లంచం ఇస్తే గాని ఏ పని ముందుకు కదలదు అనే విషయం జనాలు కూడా బాగా అర్థం అయిపోయింది.లంచాలకు ప్రభుత్వాధికారులు అందరూ బాగా అలవాటు పడిపోయారు.

ప్రస్తుతం చాలా చోట్ల అవినీతి విషయంపై చర్చ తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో నిజాయితీగా పనిచేస్తే వ్యవస్థలో అవినీతి ఉండదని జనాల నుంచి ప్రశంసలు అందుకోవచ్చు అంటూ నిరూపిస్తున్నారు ఓ అధికారి.

తాను లంచం తీసుకోను అంటూ ఓ పెద్ద బోర్డును తన కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీస్ లో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న తోడేటి అశోక్ నేను లంచం తీసుకోను అంటూ తాను విధులు నిర్వహిస్తున్న ఆఫీసులో బోర్డు పెట్టారు.ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు లంచం తీసుకోకుండా వారిని చైతన్యం చేసేందుకు తాను ఈ విధంగా బోర్డు రాయించాను అని, ప్రతి ఒక్కరు నీతి నిజాయితీలతో పనిచేయాలని అశోక్ చెబుతున్నారు.

నిజంగా ఆయనకు వాట్సాప్ చెప్పాల్సిందే కదా !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube