'ఆనం ' కు ఆఫర్లే ఆఫర్లు ! టీడీపీ లోకి డౌటేనా ?

వైసిపి రెబల్ ఎమ్మెల్యేగా మారిన  వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి త్వరలోనే టిడిపిలో చేరబోతున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది.దీని తగ్గట్లుగానే 2019 ఎన్నికల్లో గెలిచిన వైసిపి ప్రభుత్వం పైన ఆయన గత కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 Offers Are Offers For Anam Doute Into Tdp , Anam Ramnarayana Reddy,tdp,ap, Ap Cm-TeluguStop.com

ఈ పరిణామాల నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి కి చెక్ పెట్టే విధంగా వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను నేదురుమిల్లి రాంకుమార్ రెడ్డికి వైసిపి అధిష్టానం అప్పగించింది.దీంతో ఇక వైసిపితో రాం నారాయణరెడ్డి కి సంబంధాలు తెగిపోయినట్లు అయింది.

త్వరలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి , పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరుతారనే ప్రచారం జరుగుతుండగా,  ఇప్పుడు రామ్ నారాయణ రెడ్డి ఆలోచనలో పడ్డారట .దీనికి కారణం ఆయనకు కేంద్ర అధికార పార్టీ బిజెపితో పాటు, జనసేన నుంచి ఆహ్వానాలు అందుతూ ఉండడమే కారణమట.

ఈ మేరకు బిజెపిలో కీలక నేత ఒకరు రాం నారాయణరెడ్డి తో మంతనాలు చేస్తున్నారని , బిజెపిలో చేరితే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని,  అంతేకాక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బిజెపి బాధ్యతలు పూర్తిగా మీ చేతుల్లోనే పెడతామని, మీరు కోరిన నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని , అలాగే రాజకీయం గాను మంచి ప్రాధాన్యం దక్కుతుందని హామీ ఇచ్చారట.

Telugu Anamramnarayana, Ap Cm Jagan, Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan,

ఇక మరోవైపు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రాం నారాయణ రెడ్డి విషయంలో సానుకూలంగా స్పందించడం,  ఆయనకు మద్దతుగా మాట్లాడడం వంటివి చేశారు.ఇక ఆ పార్టీలోని కీలక నాయకులు కొంతమంది రాం నారాయణ రెడ్డితో మంతనాలు చేస్తూ జనసేన లో చేరితే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని,  ఎలాగూ టిడిపి జనసేన పొత్తు ఖరారు అవుతున్న నేపథ్యంలో గెలుపు పక్క అని , మీ సీనియారిటీకి తగ్గట్లుగానే పార్టీలో ప్రాధాన్యం ఇస్తామని రాం నారాయణ రెడ్డికి హామీ ఇచ్చారట .దీంతో ఇప్పుడు టిడిపిలో చేరాలా లేక బిజెపి,  జనసేన లో ఏదో ఒక పార్టీలో చేరి తన రాజకీయ భవిష్యత్తు ఎటువంటి డాకా లేకుండా చేసుకోవాలా అనే విషయంలో  రామ్ నారాయణ రెడ్డి సందిగ్ధం లో పడ్డారట.

Telugu Anamramnarayana, Ap Cm Jagan, Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan,

తాను ఏ పార్టీలో చేరితే బాగుంటుందనే విషయం పై తనకు అత్యంత సన్నిహితులైన అనుచరులు, కీలక కార్యకర్తలతో ఆనం రామ్ నారాయణ రెడ్డి మంతనాలు చేస్తున్నారట.ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీగా ఉన్న బిజెపిలో చేరితే ఎలా ఉంటుందనే విషయం పైన ఆయన తన ముఖ్య అనుచరుల అభిప్రాయాలను సేకరిస్తున్నారట.దీంతో ఇప్పటివరకు ఆయన తమ పార్టీలో చేరబోతున్నారనే ఆశలతో ఉన్న టీడీపీ కి ఆనం ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక టెన్షన్ పడుతోందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube