కార్తీక సోమవారం రోజు శివుడికి వీటిని సమర్పిస్తే...అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి-Offering Things To Lord Shiva In Karthika Masam

Offering Things To Lord Shiva In Karthika Masam -

కార్తీక మాసం ప్రత్యేకత ఏమిటంటే ఈ మాసం శివ కేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం.సోమవారం రోజు శివునికి అభిషేకం చేసి శివారాధన చేస్తే కోరుకున్న కోరికలు తీరతాయి.

అలాంటిది అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివునికి అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి.సాధారణంగా చాలా మంది శివునికి అభిషేకం పాలు, నీటితో మాత్రమే చేస్తూ ఉంటారు.

 Offering Things To Lord Shiva In Karthika Masam-Offering Things To Lord Shiva In Karthika Masam-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జీవితంలో కలిగే ఆటంకాలు తొలగిపోవాలంటే చెరకురసం,తేనే వంటి వాటితో అభిషేకం చేయాలి.దేనితో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం

పరమ శివునికి తేనెతో అభిషేకం చేస్తే ఆరోగ్యం,దీర్ఘ ఆయువు కలుగుతుంది.శివునికి అత్తరు పూస్తే జీవితంలో సుఖ సంతోషాలకు కొదవు ఉండదు.చెరకు రసంతో శివునికి అభిషేకం చేస్తే ఆర్ధిక సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు.

శివునికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే సంతానం లేని వారికీ సంతానం కలుగుతుంది.మామిడి పండ్ల రసముతో అభిషేకము చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి.మారేడు బిల్వ దళం లతో అభిషేకము చేస్తే భోగభాగ్యములు లభిస్తాయి.ద్రాక్ష రసముతో అభిషేకం చేస్తే చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది.

పసుపు నీటితో అభిషేకించిన శుభ కార్యములు జరుగుతాయి.పాలు, గంగా జలంతో శివలింగాన్ని పూజించిన వారికి ఒత్తిడి దూరం అయ్యి మనసు నిర్మలంగా ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

GENERAL-TELUGU