ఆఫ్ స్క్రీన్.. పదకొండేళ్ల వయసులోనే ట్రాలీలు నెట్టే పని, వరుణ్ సందేశ్ జీవితంలో ఊహించని కష్టాలు?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కెరీర్ మొదట్లోనే మంచి జీవితం తోనే అడుగు పెడతారని అస్సలు ఊహించుకోవద్దు.కొందరు సినిమాల్లోకి అడుగు పెట్టే ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు.

 Off Screen The Age Of Eleven Unexpected Difficulties In The Life Of Varun Sandesh-TeluguStop.com

ఎంతో శ్రమిస్తారు.అంతేకాకుండా కొన్ని కొన్ని సార్లు కూలి పని చేసిన స్టార్ హీరోలు కూడా ఉన్నారు.అందులో వరుణ్ సందేశ్ కూడా తన జీవితంలో ఊహించని కష్టాలను ఎదుర్కొన్నాడు.

2007లో హ్యాపీ డేస్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్ సందేశ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.అలా వరుసగా పలు సినిమాలలో అవకాశాలు అందుకొని నటించగా అంత గుర్తింపు మాత్రం అందుకోలేకపోయాడు.

 Off Screen The Age Of Eleven Unexpected Difficulties In The Life Of Varun Sandesh-ఆఫ్ స్క్రీన్.. పదకొండేళ్ల వయసులోనే ట్రాలీలు నెట్టే పని, వరుణ్ సందేశ్ జీవితంలో ఊహించని కష్టాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో ఇండస్ట్రీకి దూరంగా ఉండగా మళ్లీ ఇటీవలే రీ ఎంట్రీ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇక ఈయన మరో సినీ నటి వితిక షేరును పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇక వీళ్లిద్దరు కలిసి స్టార్ మా లో ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 లో జంటగా పాల్గొన్నారు.ఇక వీళ్ళు హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి.

గొడవలు, రొమాన్స్ లు చేస్తూ బాగా హాట్ టాపిక్ గా నిలిచారు.బిగ్ బాస్ తర్వాత వరుణ్ సందేశ్ కు అంతగా అవకాశాలు కూడా రాలేకపోయాయి.

కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ వీడియోలను, ఫోటోలను బాగా పంచుకునేవాళ్లు.

ఇక వరుణ్ సందేశ్ కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు చూశాడట.గతంలో వరుణ్ సందేశ్ తన భార్య వితిక షేరు తో ఓ టీవీ షోలో పాల్గొని అందులో తమ వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.ఇక వరుణ్ సరదాగా తన భార్య తనకు అసలు భయపడని నాకే కాస్త భయం వేస్తుందని తెలిపాడు.

ఇక తను కొత్త బంగారులోకం సినిమాతో పేరు సంపాదించుకున్నానని తెలిపాడు.తను అమెరికాకు పోవడానికి ఒక కారణం ఉందని మధ్యలో అవకాశాలు లేవని అంతేకాకుండా సాఫ్ట్ వేర్ రంగం వైపు వెళ్దామని అనుకోవడంతో అలా వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు.

అలా కొన్ని విషయాలను పంచుకున్న వరుణ్ సందేశ్ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాడట.తను పదకొండేళ్ల వయసులో ఉన్నప్పుడు షాపులో ట్రాలీలు నెట్టే పనిచేసేవాడట.అంతేకాకుండా క్యాషియర్ గా కూడా చేశాడట.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో అవకాశం రావడంతో మంచి పేరు వచ్చిందని.కానీ మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపాడు.ఆ సమయంలో తనకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అందులో దిల్ రాజ్ అని తెలిపాడు.

ఆయన డి ఫర్ దోపిడి అనే సినిమాతో అవకాశం ఇచ్చాడని మరో వ్యక్తి అల్లరి నరేష్ అంటూ ఆయన కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడంటూ ఈ ఇద్దర్నీ ఎప్పటికీ మర్చిపోలేను అని తెలిపాడు వరుణ్.ఇక ప్రస్తుతం ఈయన ఎం ఎస్ ఆర్ దర్శకత్వంలో ఇందువదన అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

#KothaBangaru #Varun Sandesh #Eleven #Screen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు