హీరోయిన్ ప్రణీతపై ప్రశంసల వర్షం.. ఏం చేశారంటే?

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రణీత.తెలుగు సినిమాలలో మంచి పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

 Of Praise On The Heroine Praneeth-TeluguStop.com

తన అందంతోఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.ఇప్పటివరకు ఎటువంటి గాసిప్ లకు కూడా లొంగిపోలేదు ఈ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలావుంటే ఇటీవలే రహస్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 Of Praise On The Heroine Praneeth-హీరోయిన్ ప్రణీతపై ప్రశంసల వర్షం.. ఏం చేశారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజ్ అనే వ్యక్తిని సాంప్రదాయ ప్రకారం అతి తక్కువ మంది సమక్షంలో తన ఇంట్లో పెళ్లి చేసుకుంది ప్రణీత.ఇక ప్రణీత సోషల్ సర్వీస్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

గత ఏడాది నుండి ఇప్పటివరకు కరోనా సమయంలో తన వంతు సహాయం తో ముందుకు వచ్చింది.స్వయంగా తానే ఫుడ్డు వండి మరి అందరికీ అందించింది.అంతేకాకుండా తన టీమ్ మెంబర్స్ తో కలిసి నిత్యవసర వస్తువులు కూడా ఎంతో మంది ప్రజలకు అందించింది.ఇక తాజాగా మరింత సేవ తో ముందుకు వచ్చింది.

Telugu Bengaluru, Praise, Pranitha, Vaccination Drive-Movie

ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ అంతలోనే మళ్లీ సహాయంతో ముందుకు వచ్చింది.ప్రస్తుతం చాలామంది ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతూ ఉండగా ఆక్సిజన్ ను కూడా అందించింది.అంతేకాకుండా ప్రస్తుతం ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉచితంగా వ్యాక్సిన్ సదుపాయాన్ని కూడా అందించింది.ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షేర్ చేయగా తన ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అస్టర్ అనే ఆస్పత్రిలో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నారని కాబట్టి అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది.

ఈ నేపథ్యంలో ప్రణీత చేస్తున్న సహాయానికి నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ప్రస్తుతం ప్రణీత వరుస సినిమాలలో బిజీగా ఉండగా బాలీవుడ్ లో హంగామా 2, భుజ్ అనే వరుస సినిమాలలో నటిస్తుంది.

అంతే కాకుండా కన్నడంలో మరో సినిమాలో కూడా నటించనుంది.

#Praise #Pranitha #Bengaluru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు