భవిష్యత్తులో భారత్ నుంచీ మరిన్ని వలసలు...రీజన్ ఏంటంటే...!!!

విదేశాలకు మన వాళ్ళు వలసలు వెళ్లి అక్కడ ఉన్నత ఉద్యోగం సంపాదించి అనేక రంగాలలో ఎంతో అత్యున్నతమైన స్థానాలకు చేరుకుంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో నైనా సరే మన భారతీయుల హవానే కొనసాగుతోంది.

 Oecd Reports Show India To Produce Highest Number Of Migrants,indians, India, America, Oecd Report, Oecd,indian Government,organisation For Economic Co-operation And Development-TeluguStop.com

ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాలో ఈ వలసలు అత్యధికంగా కనిపిస్తాయి.మన వాళ్ళు అక్కడ ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారని ఇక్కడ మనం సంబరపడిపోతాం.

నిజమే విదేశంలో మన భారతీయుడు సత్తా చాటితే మనకేకదా గర్వ కారణం.అయితే మన సత్తా మన దగ్గర చాటితే భారత దేశం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది కదా ఇక్కడ చదువుకుని జ్ఞానం సంపాదించి అక్కడికి వెళ్లి ఆ దేశాన్ని బాగు చేయడం దేనికి అనే మేధావులు లేకపోలేదు.

 OECD Reports Show India To Produce Highest Number Of Migrants,Indians, India, America, OECD Report, OECD,Indian Government,Organisation For Economic Co-operation And Development -భవిష్యత్తులో భారత్ నుంచీ మరిన్ని వలసలు#8230;రీజన్ ఏంటంటే#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రశ్న అందరిలో మెదులుతుంది.మరి మన దేశంలో మన వారి మేధస్సు ఎందుకు ఉపయోగించుకోలేక పోతున్నామనంటే.

భారత్ ముందునున్న భవిష్యత్తులో అతి పెద్ద సమస్యగా మారుతున్న సమస్య మేధో వలసలు.ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కొ ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్( OECD) తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం.

భారత్ నుంచీ విదేశాలు వెళ్తున్న ప్రతీ ముగ్గురిలో ఇద్దరు అత్యంత ప్రతిభ ఉన్న వారేనని తన నివేదికలో వెల్లడించింది.ఇదిలాఉంటే

భారత్ లో అత్యద్భుతమైన విద్యా వ్యవస్థ ఉంది, నిపుణులుగా తీర్చి దిద్దగల సామర్ధ్యాలు, ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి.

అయితే సమస్యల్లా ఇక్కడ చదువులకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, వారి ప్రతిభకు తగ్గట్టుగా అవకాశాలు కల్పించలేని ఆర్ధిక రంగం లేకపోవడమే ప్రధాన సమస్యగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.వ్యవస్థలలో దాగివున్న అవినీతి, కారణంగా ఎంతో మంది ప్రతిభ వెలికి రావడంలేదని, అయితే విదేశాలలో ఈ వ్యవస్థ ఉన్నా ఆ దేశ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాలికలు రూపొందించుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు విదేశాలలో గణితం, సైన్స్, టెక్నాలజీ రంగాలకు పెద్ద పీటవేయడంతో ఆయా రంగాలలో భారతీయులు నైపుణ్యంగల వారిగా ఉండటంతో మన వారికి భారీ జీతాలను ఆఫర్ చేస్తూ ఆయా దేశాల వైపు ఆకర్షించుకుంటున్నారని ఈ విషయంలో భారత ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ చూపగలిగితే వలసలను నియంత్రించడం సాధ్యమవుతుందని అంటున్నారు.కాగా 2019 నాటికి విదేశాలు వలస వెళ్ళిన వారి సంఖ్య 7 .5 లక్షలు ఉండగా ఆ సంఖ్య 2024 నాటికి 18 లక్షలకు చేరువ అవుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube