మొబైల్ ఉంది కదా అని హంతకుడితో సెల్ఫీ దిగిన పోలీస్ అధికారి,చివరికి

చేతిలో మొబైల్ ఉంది కదా అని ప్రతి ఒక్కరితో సెల్ఫీలు తీసుకుంటే ఎలాంటి అనర్ధాలు వస్తాయో అనే దానికి ఈ ఘటన ఉదాహరణ.ఒక పోలీసు అధికారి అయి ఉండి ఒక క్రిమినల్ తో సెల్ఫీ తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

 Odissapolice Officer Suspendedfor Clicking Selfie-TeluguStop.com

వివరాల్లోకి వెళితే ఒడిశాలోని పూరి జిల్లాలోని అలసాహి ప్రాతంలో ఓ హత్య చోటుచేసుకుంది.అయితే ఈ కేసు విచారణ జరపగా బులు ముండా అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా ఒక పోలీసు అధికారి ఆ నిందితుడి తో కలిసి సెల్ఫీ దిగారు.అయితే ఫోటో దిగిన తరువాత అంతటితో ఆగకుండా ఆ ఫోటో కాస్త సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో వివాదం రాజుకుంది.

చివరకు ఆ ఫోటోలు జిల్లా ఎస్పీ దాకా చేరడంతో అధికారి గారి సెల్ఫీ కి ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనితో విధి నిర్వహణ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఆ అధికారి పై సస్పెన్షన్ వేటు పడింది.

అంతేకాకుండా నిందితుడు బులు ముండా ను కూడా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసినట్లు తెలుస్తుంది.

ఒక భాద్యత గల పోలీసు ఆఫీసర్ అయి ఉండి ఇంత నిర్లక్ష్యంగా ఒక హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి తో కలసి సెల్ఫీ దిగడమే కాకుండా ఆ ఫోటోను కాస్త సోషల్ మీడియా లో కూడా పోస్ట్ చేయడం తో చివరికి ఉద్యోగం లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

దీనిని బట్టి అయినా అర్ధమవుతుందేమో సెల్ఫీ ఎంత డేంజర్ అనేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube