గుంటూరు లో ఒరిస్సా యువతి దారుణ హత్య! తల్లిదండ్రుల ఫిర్యాదులో వెలుగులోకి!  

Odisha Women Murdered In Guntur-

గుంటూరు పట్టణంలో ఒరిస్సాకి చెందిన యువతీ హత్య ఘటన ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.ఇప్పుడు ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.మమతాశెట్టి అనే యువతి కొద్ది రోజుల క్రితం తనని ప్రేమించిన దివాకర్ అనే వ్యక్తిని కలవడానికి ఇంటి నుంచి వచ్చేసింది..

Odisha Women Murdered In Guntur--Odisha Women Murdered In Guntur-

ఆ తరువాత నుంచి ఆమె ఆచూకి తెలియకపోవడం.మమతా శెట్టి నుంచి తల్లిదండ్రులకి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె గుంటూరు వెళ్లిందని తెలుసుకొని తాజాగా నగరానికి వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేసారు.

తమ కుమార్తె దివాకర్ అనే వ్యక్తిని ప్రేమించిందని, అతని కోసం గుంటూరు వచ్చినట్లు వారు పోలీసులకి ఫిర్యాదు చేసారు.ఈ నేపధ్యంలో విచారణ ఆరంభించిన పోలీసులకి స్థానిక స్మశానంలో మమతా శెట్టి అస్థికలు లభ్యమయ్యాయి.

వాటిని వైద్యపరీక్షల నిమిత్తం పంపించిన పోలీసులు మమతా ప్రియుడు దివాకర్ ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన అతను పరారిలో వుండటంతో అతనికి సహకరించిన ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.