కరోనా అతని లైఫ్ నే మార్చేసింది..ఇప్పుడు యూట్యూబ్ స్టార్ అయ్యాడు !

కరోనా కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.తినడానికి తిండి లేక ఉన్న ఉపాధిని కూడా కోల్పోతూ బతకాలని ఆశ కూడా వదిలేసుకుంటూ జీవిస్తున్నారు.

 Odisha Tribal Labourer Who Started Channel In Lockdown Earns Lakhs From Youtube,-TeluguStop.com

ఇంకా రోజు పని చేస్తేనే కడుపునిండే కూలీలా గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.ఈ కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో రోజువారీ కూలీలకు పూట గడవడమే కష్టమైంది.

కానీ ఒక వ్యక్తి ఈ కష్టాలను ధైర్యంగా ఎదిరించి తనని తాను నిరూపించుకున్నాడు.

ఒడిశా కు చెందిన 35 ఏళ్ల వ్యక్తి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

కానీ కరోనా వచ్చి తన జీవితాన్ని తల్లకిందులు చేసింది.లాక్ డౌన్ కారణంగా అతడికి పనులు లేక ఇంట్లో ఉండి ఏమి చేయాలో తోచలేదు.

తన స్నేహితుడి ఫోన్లో యూట్యూబ్ వీడియోలు చూసిన తర్వాత ఇసాక్ కు ఒక ఐడియా వచ్చింది.అనుకున్న వెంటనే ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు.

Telugu Isak Munda, Odishalaborer, Odisha Labourer, Odisha Tribal, Odishatribal,

అప్పటి నుండి ఒక ఛానెల్ పెట్టి అందులో తమ గ్రామంలో నివసిసున్న ప్రజలు ఆహారపు అలవాట్లపై వాళ్ళ జీవన విధానంపై వీడియోలు తీస్తూ పోస్ట్ చేసేవాడు.మొదటి వీడియోలో తమ గ్రామంలో ఉండే ప్రజలు ఏమి ఆహారం తింటారు అనే దానిపై వీడియో చేసి పోస్ట్ చేసాడు.మొదటి వీడియో నే క్లిక్ అవ్వడంతో ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు.4.99 లక్షల మంది మొదటి వీడియోను చూసారు.

అలాగే మిగతా వీడియోలు కూడా తమ ఊరు గురించి జీవిన విధానంపై దాదాపు 250 వీడియోలు చేసారు.

ఆహార పదార్ధాలను టేస్ట్ చేస్తూ కూడా కొన్ని వీడియోలు చేసాడు.ఇప్పుడు యూట్యూబ్ ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తూ యూట్యూబ్ స్టార్ అయ్యాడు.

Telugu Isak Munda, Odishalaborer, Odisha Labourer, Odisha Tribal, Odishatribal,

మొదటిసారి యూట్యూబ్ నుండి 37000 అందుకున్నాడు.ఆ తర్వాత 5 లక్షలు వచ్చాయని అతడు చెబుతున్నాడు. ‘isak munda eating’ ఛానెల్ లో అతడికి ప్రస్తుతం 7.37 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.మొత్తానికి కరోనా తో ఏం చేయాలో తెలియక వచ్చిన ఐడియాను బాగా ఉపయోగించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube