ఇంకా సాగుతున్న మూఢవిశ్వాసాలు,కరోనా అంతం అంటూ నరబలి

ఒకపక్క 5 జీ కూడా అందుబాటులోకి వచ్చేస్తున్న ఇలాంటి సమయంలో కూడా దేశంలో అక్కడక్కడా మూఢ విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు.ఇంతగా టెక్నాలజీ దూసుకెళుతున్నప్పటికీ అడపాదడపా ఎక్కడో ఒకచోట తమ అజ్ఞానం తో కొంతమంది పైశాచికంగా వ్యవహరిస్తున్నారు.

 Odisha Priest Beheads A Man Following Dreams That It Would End Corona Pandemic,e-TeluguStop.com

దేశంలో కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో మూఢ విశ్వాసం తో ఒక పూజారి పైశాచికంగా ప్రవర్తించారు.నరబలి ఇస్తే కరోనా వైరస్‌ అంతమవుతుందని భావించిన ఒక పూజారి ఇలాంటి ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తుంది.

ఒడిశాలో ఈ ఘటన చోటుచేసుకుంది.నరబలి ఇస్తే కరోనా అంతం అవుతుంది అంటూ పూజారికి కలవచ్చిందట.ఇక దానితో ఆ పూజారి 55 ఏండ్ల వ్యక్తి తల నరికి తన కల నెరవేర్చుకున్నాడు.ఈ ఘటనకు పాల్పడిన పూజారి సంసారి ఓఝాను ఒడిశా పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తుంది.

సరోజ్‌కుమార్‌ ప్రధాన్‌ (మృతుడు)అనే వ్యక్తి బుధవారం రాత్రి కటక్‌లోని నరసింహాపూర్‌ బ్లాక్‌ బంధహుడా బ్రాహ్మణి ఆలయంలోని వచ్చి.తల వంచి దేవతను కొలుస్తుండగా ఆ సమయంలో వెనుకగా వచ్చిన పూజారి సంసారి ఓఝా ప్రధాన్‌ మెడపై కొడవలితో ఒక్క వేటు వేసి తల నరికేశాడు.

దైవాదీనం మేరకే తాను నరబలి చేశానని పూజారి ఒప్పుకొని పోలీసుల ముందు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు.అయితే మరోవిషయం ఏమిటంటే నిందితుడు పూజారికి, మృతుడితో కొన్నాళ్లుగా ఓ మామిడి తోట విషయంలో చాలా కాలంగా వివాదం ఉందని తెలుస్తుంది.

అయితే కలలో వచ్చినట్లు చేశాను అని చెప్పిన పూజారి మాటల్లో నిజం ఎంతుందో అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube