వామ్మో.. టీవీ వెనుక పాము.. చూస్తే మీరు కూడా జాగ్రత్త పెడతారేమో?

మామూలుగా మనం దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కనే పాము కనిపించింది అంటే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది.ఇక ఆ పాము పడగ విప్పి బుస కొడుతుంటే ఇంకేముంది గుండె జారిపోయి అక్కడినుంచి పరుగోపరుగు.

 Odisha Man, Snake, Tv Rack, Snake On Tv Stand-TeluguStop.com

అదే ఇంట్లోకి… అది కూడా మనం రోజూ చూసే టివి వెనకాలకి పాము వస్తే అమ్మో ఇంకేమైనా ఉంటుందా… తాజాగా ఇక్కడో కుటుంబానికి ఇలాంటి ఓ భయానక అనుభవం ఎదురైంది.

ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా సిమిలిగూడ లో జగన్నాథ నాయక్ అనే వ్యక్తి ఇంట్లో ఓ నాగుపాము తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

ఆ పాము టీవీ వెనుకకు ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ… తాజాగా జగన్నాథ నాయక్ టీవీ స్విచ్ ఆన్ చేయడానికి ప్రయత్నించాడు.ఇంతలో బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది… దీంతో ఒక్కసారిగా అవాక్కయిన ఆ వ్యక్తి… ఏంటో అని కాస్త భయం భయంగానే చూసాడు.

చూస్తే టీవీ వెనకాలే భారి నాగుపాము.

ఇంకేముంది ఒక్కసారిగా కాళ్ళు చేతులు ఆడలేదు.

వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసాడు సదరు వ్యక్తి.ఇక హుటాహుటిన స్నేక్ హెల్ప్ లైన్ సెంటర్ నుంచి ఓ వ్యక్తి వచ్చి.

టీవీ వెనుక జాగ్రత్తగా నక్కి ఉన్న ఓ పామును బయటకు తీసి సంచిలో బంధించాడు.ఇది విషపూరితమైన నాగుపాము అని… ఎవరిపైనా దాడి చేసిన ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేది అంటూ సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.

కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube