ఆహార భద్రతాచట్టం అమలులో ఒడిషా ఫస్ట్

రేషన్‌ దుకాణాల ద్వారా జాతీయ ఆహార భద్రతాచట్టం అమలులో ఒడిశా దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది.ఉత్తర్‌ప్రదేశ్ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచాయి.

 Odisha First In Implementation Of Food Security Act , Union Minister Piyush Goya-TeluguStop.com

తెలంగాణకు 12వ స్థానం దక్కింది.ఆహార భద్రతా చట్టం అమలుపై రాష్ట్రాల మంత్రులతో సమావేశమైన సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ర్యాంకుల సూచీని విడుదల చేశారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో గుజరాత్ నాలుగో స్థానంలో, దాద్రానగర్ హవేలీ, దమన్ దీవులు ఐదో స్థానంలో, మధ్యప్రదేశ్ ఆరో స్థానంలో, బీహార్ ఏడో స్థానంలో, కర్నాటక ఎనిమిదవ స్థానంలో నిలిచాయి.ప్రత్యేక కేటగిరి రాష్ట్రాల్లో త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది.

తర్వాతి స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి.ఆ రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉన్నప్పటికీ.

సాధారణ రాష్ట్రాలతో పోటీ పడ్డాయని సూచీలో పేర్కొన్నారు.

జాతీయ ఆహార భద్రతాచట్టం కింద రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసరాలు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ టీపీడీఎస్‌ కింద ఆయా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్న తీరును సూచీలో లెక్కిస్తారు.

Telugu Gujarat, Odisha Security, Piyushgoyal, Piyush Goyal-Political

తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు పీయూష్‌ గోయల్‌ ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు.రానున్న కాలంలో ఇతర రాష్ట్రాలు ఈ పథకం అమలుపై దృష్టి సారించాలని గోయల్ సూచించారు.ఒకే దేశం.

ఒకే రేషన్‌ కార్డు లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఈ పథకం కింద రేషన్ పొందొచ్చునని కేంద్రమంత్రి భరోసా ఇచ్చారు.

అయితే జాతీయ ఆహార భద్రతాచట్టం అమలులో ఒడిశా దేశంలోనే అగ్ర స్థానంలో నిలవడం ఓ గొప్ప విశేషమని చేప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube