ఇష్ట పడి శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదట…  

Odisha Court Verdict In False Pretext Of Marriage - Telugu Court Verdict, Crime Case, Cuttuck, False Pretext, Odisha, Rape News

మన నిజ జీవితంలో విజయవంతమైన ప్రేమ కథల కంటే ప్రేమ పేరుతో వంచనకు గురైన ప్రేమ కథలను, జంటలను ఎక్కువగా వింటూ ఉంటాం… అలాగే చూస్తుంటాం.తాజాగా ఓ యువకుడు యువతిని ప్రేమ పేరుతో వంచించి ఆమెకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేసి చివరికి పెళ్లి చేసుకొమ్మని చెప్పగా నిరాకరించాడు.

 Odisha Court Verdict In False Pretext Of Marriage

దీంతో యువతి పోలీసులను ఆశ్రయించి అతడిపై ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే దేశంలోని ఒరిస్సా రాష్ట్రంలో ఓ ప్రాంతంలో యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.

ఇష్ట పడి శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదట…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడు ఈ యువతిపై కన్నేశాడు.భాగంగా పరిచయం, ప్రేమ పేరుతో యువతిని లొంగ దీసుకొని పలుమార్లు ఆమెను శారీరకంగా కలిశాడు.

అయితే ఈ క్రమంలో యువతి రెండు సార్లు గర్భం కూడా దాల్చింది.

దీంతో భయపడినటువంటి యువకుడు యువతికి పలుమార్లు అబార్షన్ చేయించాడు.

దీంతో యువకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది.కానీ యువకుడు ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.

దీంతో యువతి తాను మోసపోయినని గ్రహించి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.అలాగే తనకు ఇష్టం లేకుండా లోబర్చుకొని తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.దీంతో యువకుడు తనకు బెయిల్ కావాలని దరఖాస్తు చేసుకున్నాడు.ఈ క్రమంలో కోర్టు యువతి యువకుడిపై చేసినటువంటి అభియోగాలు పరిశీలించి ఇష్టపడి శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందికి రాదని యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.

దీంతో పలువురు నెటిజన్లు ప్రేమ పేరుతో ఇలా మోసం చేసేటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

అంతేగాక ఆడపిల్లలు కూడా తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Odisha Court Verdict In False Pretext Of Marriage Related Telugu News,Photos/Pics,Images..

footer-test