నేడు కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం.. !

ఈ రోజు కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ రెండోదశ దేశంలో మొదలైన విషయం తెలిసిందే.దేశ‌వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 60 ఏళ్లు దాటిన వారికి ఉచిత కోవిడ్ టీకాను వేస్తున్నారు.

 Odisha Cm Take First Dose Of Covid Vaccine Today-TeluguStop.com

ఈ క్రమంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ఇవాళ ఉద‌యం ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిట‌ల్‌లో టీకా తీసుకున్న విష‌యం తెలిసిందే.ఇదే కాకుండా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాంజేందర్ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు.

ఇకపోతే ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా ఈరోజే కోవిడ్ టీకా తీసుకున్నారు.కాగా కోవిడ్ టీకా తీసుకున్న న‌వీన్ ప‌ట్నాయ‌క్‌.రాష్ట్ర ప్ర‌జ‌ల‌ందరు కూడా టీకా తీసుకోవాల‌ని అభ్య‌ర్థించారు.ఇందుకు అర్హులైన‌వారంతా స్వచ్చందంగా ముందుకు వ‌చ్చి వ్యాక్సిన్ వేసుకోవాల‌న్నారు.

 Odisha Cm Take First Dose Of Covid Vaccine Today-నేడు కోవిడ్ టీకా తీసుకున్న ఒడిశా సీఎం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఒడిశాను కోవిడ్ ర‌హిత రాష్ట్రంగా మారుద్దామ‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.ఇవాళే తొలి డోసు టీకాను తీసుకున్నాన‌ని, ఇంత త్వరగా కరోనా టీకాను త‌యారు చేసిన శాస్త్ర‌వేత్త‌ల‌కు థ్యాంక్స్ అంటూ పేర్కొన్నారు.

.

#Covid Vaccine #Odisha Cm #Naveen Patnaik #Today #First Dose

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు