యాప్‌ ఉన్నంత మాత్రాన చాలదు....!

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనుషులు నైతికంగా, సామాజికంగా దిగజారడం ఎక్కువైంది.టెక్నాలజీ మనిషి భౌతిక అవసరాలు తీరుస్తున్నా మానసిక ఎదుగుదలకు తోడ్పడటంలేదు.

 Mobile App For Women Security-TeluguStop.com

సెల్‌ఫోన్‌ మనిషికి చాలా ఉపయోగకరమైనా అదే సెల్‌ఫోన్‌తో అనేక అనైతికమైన పనులు చేస్తున్నారు.అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతున్నారు.

సెల్‌ఫోన్‌లను ఉపయోగించి మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు.ఇలా ప్రతీ సాంకేతిక పరికరంతో ఎంతో చెడు కూడా చేస్తున్నారు.

టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగించుకోకపోవడమే మనం చేస్తున్న తప్పు.మహిళలకు భద్రత ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

వారి అభద్రతకు టెక్నాలజీ ఎంతగా కారణమవుతున్నా అదే టెక్నాలజీతో ఆ సమస్య అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు.మహిళల భద్రతకు ఉపయోగపడే ‘యాప్‌’ను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రారంభించారు.

ఇది భవనేశ్వర్‌, కటక్‌ నగరాల్లోని మహిళలకు ఉపయోగపడుతుంది.ఈ యాప్‌ను ఉపయోగించే మహిళలకు అన్నివిధాల సహకరించాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించారు.

టెక్నాలజీ మహిళల చేతుల్లో ఉంటే సహకారం పోలీసుల నుంచి రావాలి.అంటే వారు సహకరిస్తేనే వీరికి భద్రత.

మహిళలకు రక్షణ కల్పించేందుకు మన పోలీసులు ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube