పద్మశ్రీ అతని పాలిట శాపంగా మారింది

దేశంలోఅ అత్యున్నత పురష్కారాలలో ఒకటైన పద్మశ్రీ అతి కొద్ది మందికి మాత్రమే వస్తుంది.ఆయా రంగాలలో ప్రముఖంగా గుర్తింపు పొందిన వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ గౌరవం ఇస్తుంది.

 Odisha Canal Mandaitari Nayak Struggling For Food1-TeluguStop.com

అయితే ఇండియాలో అప్పుడప్పుడు ఇలాంటి పద్మశ్రీ గౌరవం కొంత మంది సామాన్యులకి కూడా దక్కింది.అయితే పద్మశ్రీ వచ్చిన ఘనత వారికి ఉన్న, తరువాత సాధారణ జీవితం గడుపుతున్న వారికి ఈ గుర్తింపు కారణంగా తమ రోజు వారి జీవితం కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది.

ఇప్పుడు అలాంటి స్తితిలో దైతరి నాయక్ అనే వృద్ధుడు ఉన్నాడు.

పర్వత శ్రేణుల్లోని జల ప్రవాహాన్ని తన స్వగ్రామానికి తీసుకురావడానికి ఆయన మూడు కిలోమీటర్ల మేర కాలువ నిర్మించిన ధైతరి నాయక్ గొప్పతనం గుర్తించి అతనికి లభించింది.

కుటుంబ పోషణకు కూలి చేసుకుంటూ, ఖాళీ సమయాల్లో ఈ కాలువను అతను చిన్న పలుగు, చిన్న పార సహాయంతో నిర్మించారు.అనేక సంవత్సరాల పాటు మొక్కవోని దీక్షతో ఈ కాలువను నిర్మించిన ఆయన గొప్పతనాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘పద్మశ్రీ’ పురష్కారంతో సత్కరించింది.

అయితే ఇప్పుడు పద్మశ్రీ పురస్కారమే తనకు శాపంగా మారిందని దైతరి నాయక్ చెప్పారు.ప్రభుత్వ గుర్తింపు రాకముందు తాను వ్యవసాయ పనులకు వెళ్ళి, తన కుటుంబాన్ని పోషించుకునేవాడినని చెప్పారు.

ప్రస్తుతం తనను వ్యవసాయ పనులకు పిలవడం లేదన్నారు.దీంతో తన ఆర్ధిక పరిస్థితి ఘోరంగా తయారైంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వానికి తన పద్మశ్రీ పురష్కారం తిరిగి వెనక్కి ఇచ్చేసి, తాను మరల సాధారణ కూలీగా ఉంటానని అతను చెబుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube