అద్బుతమైన ప్రతిభను చాటుకున్న ఒరిస్సా కళాకారుడు.. అగ్గిపుల్లలతో రథం !

ఎవరిలో ఏ ప్రతిభ దాగి ఉందో చెప్పడం చాలా కష్టం.ఎందుకంటే ఎప్పుడు ఎవరిలో ప్రతిభ బయట పడుతుందో మనకు తెలియదు.

 Odisha Artist Crafts Chariots Of Lord Jagannath, Devi Subhadra, Lord Balabhadra-TeluguStop.com

ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది.అది సమయం వచ్చి నప్పుడు బయట పడుతుంది.

మనం తరచు వింటూనే ఉంటాం.ఎందరో వ్యక్తుల ప్రతిభ ఈ ప్రపంచానికి పరిచయం అవుతూనే ఉంటుంది.

తాజాగా ఒరిస్సాకు చెందిన ఒక కళాకారుడు తన ప్రతిభను నిరూపించు కున్నాడు.

ఆ విషయంలో ఆ కళాకారుడిని మెచ్చుకోకుండా ఉండలేరు.

ఈయన అగ్గిపుల్లలతో రథాన్ని చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.ఆ రథాలను చుస్తే చూపు తిప్పుకోలేరు.

అంత అందంగా నిజమైన రాధాలుగా చాలా బాగున్నాయి.త్వరలోనే జరగ బోతున్న పూరీ జగన్నాథ్ యాత్ర సందర్భంగా ఆ కళాకారుడు ఈ రథాలను తయారు చేసాడు.

ఈ జగన్నాథ్ యాత్ర కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు.

Telugu Devi Subhadra, Lord Balabhadra, Odishaartist, Odishaminiature, Purijagann

మినియేచర్ ఆర్టిస్ట్ ఎల్ ఈశ్వర్ రావు ఈ అగ్గిపుల్లల రధాన్ని తయారు చేసాడు.ఇందుకోసం ఈయన 435 అగ్గిపుల్లలను ఉపయోగించాడు.ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ రథ యాత్ర ఈ సంవత్సరం కూడా జరగనుంది.

ఇందుకోసం అప్పుడే ఏర్పాట్లు మొదలు పెట్టారు.భలభద్ర, సుభద్ర సహిత జగన్నాథ్ స్వామి రథ యాత్ర కోసం యావత్ భారత దేశంలో ఉన్న భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు.

Telugu Devi Subhadra, Lord Balabhadra, Odishaartist, Odishaminiature, Purijagann

కరోనా తాకిడి ఉన్న కూడా భక్తులు ఈ రథ యాత్రలో పాల్గొనడానికి ఇష్టపడుతున్నారు.ఈ సందర్భంగా కళాకారులు తమ ప్రతిభను నిరూపించు కుంటున్నారు.ఎల్ ఈశ్వర్ రావు 435 అగ్గిపుల్లలతో 9 రోజులు శ్రమించి మూడు రథాలను రూపొందించాడు.ఆ రథాలను రంగురంగులతో అందంగా తీర్చిదిద్దాడు.అంతేకాదు ఆ రథాలలో జగన్నాథ్ స్వామి, భలభద్ర, సుభద్ర లు కొలువై ఉన్నట్టు తీర్చి దిద్దడంతో అవి నిజమైన రథాలుగా కనువిందు చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube