ఢిల్లీలో సోమవారం నుండి సడలింపులు..!

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అదుపులోకి రావడంతో సీ.ఎం కేజ్రీవాల్ లాక్ డౌన్ ను ఎత్తేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది.ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండగా మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.400 కేసులు కన్నా తక్కువ వస్తున్న టైంలో సడలింపులపై ప్రభుత్వం మొగ్గు చూపుతుంది.రోజువారి కేసులు 400 కన్నా తక్కువ ఉండటం.పాజిటివిటీ రేటు 0.5 శాతం ఉండటంతో లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నారు.ఇప్పటికే ఢిల్లీలో లాక్ డౌన్ అన్ లాక్ ప్రక్రియ మొదలు పెట్టగా ఇప్పుడు మరికొన్ని సడలింపులు ఇవ్వనున్నారని తెలుస్తుంది.

 Odd Even Basis Shopping Malls And Markets Open In Capital City Delhi From Monday-TeluguStop.com

ఢిల్లీలో సోమవారం నుండి షాపింగ్ మాల్స్, మార్కెట్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.సరి బేసి విధానంలో ఇవి తెరచుకోవచ్చని చెబుతున్నారు.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు షాపులు తెరచుకునే అవకాశం ఇస్తున్నారు.ప్రభుత్వం ఆఫీసుల్లో గ్రూప్ ఏ ఆఫీసర్లు 100% శాతం విధులకు హాజరు కావాలని చెప్పారు.

గ్రేడ్ ఉద్యోగులు 50 శాతం మంది విధులకు రావాల్సి ఉంటుందని చెప్పారు.అత్యవసర విభాగంలో ఉన్న వారు 100 శాతం డ్యూటీలకు రావాల్సి ఉంటుందని అన్నారు.

ప్రైవేట్ ఆఫీసులను 50 శాతం సిబ్బందితో నడిపించొచ్చని తెలిపారు.అయితే ఇంటి నుండి పనిచేసే అవకాశం ఉంటే అలాంటి వారిని వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వాలని అన్నరు.

అంతేకాదు 50 శాతం సామర్ధ్యంతో ఢిల్లీ మెట్రో నడిపించనున్నారు.ఈ కామర్స్ సేవలను స్టార్ట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube