వైరల్ వీడియో: పార్టీ కోసం గ్లాస్‌ సిద్ధం చేసుకుంటున్న ఆక్టోపస్...!

రోజురోజుకి ఓవైపు భూమిమీద, మరోవైపు వాయు కాలుష్యం, ఇంక సముద్ర గర్భంలో కూడా అనేక వ్యర్ధాలు చేరి సముద్రాన్ని కలుషితం చేస్తున్నాయి.ఇకపోతే మానవాళి ఎక్కువగా సంచరిస్తున్న సముద్రపు బీచ్ లు, సముద్రం ద్వారా ప్రయాణించే వారి ద్వారా ఎక్కువగా ప్లాస్టిక్ సముద్రం లో చేరుతోంది.

 An Octopus Preparing Glass For A Party  Octopus, Susanth Nandha, Ifs Officer, Oc-TeluguStop.com

దీనితో సముద్రంలో ఉండే జీవులు ప్లాస్టిక్ వ్యర్థాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

రోజురోజుకి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రగర్భంలో చేరుకొని వాటిని తినడం ద్వారా సముద్ర గర్భంలో నివసించే అనేక జంతు చరాలు మృత్యువాత పడుతున్నాయి.

ప్లాస్టిక్ శరీరంలో చేరుకోవడం ద్వారా జంతువుల అవయవాలు దెబ్బతినడం ద్వారా అవి త్వరగా మృత్యువాత పడుతున్నాయి.ఇలాంటి సంఘటనే తాజాగా ఓ వీడియో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో ని భారతదేశానికి చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నంద ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఇక ఆయన షేర్ చేసిన వీడియోలో ఓ ఆక్టోపస్ ఒక గ్లాసును మరోవైపు బాటిల్ కు సంబంధించిన మూతని మోసుకొని వెళుతుంది.

అయితే ఈ వీడియోకు సుశాంత్ నందా రాత్రి పార్టీకి గ్లాస్ తీసుకువెళ్తుంది అంటూ శీర్షికను జతచేశారు.ఇకపోతే ప్రపంచం మొత్తం ఇనుప యుగం నుండి ప్లాస్టిక్ యుగం వరకు చేరిందని, ప్లాస్టిక్ వాడకం తగ్గించుకోకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలియజేశారు.

అంతేకాదు ప్లాస్టిక్ ని రీసైకిల్ చేసి వాడండని చెబుతున్నారు ఆయన.ఇక ఈ వీడియోకి సంబంధించి అనేక మంది నెటిజన్స్ వారి భావాలను కామెంట్స్ రూపంలో జత చేస్తున్నారు.ఇందుకు సంబంధించి ఈ దృశ్యం చాలా బాధాకరమైన విషయమని మనం చేసిన తప్పులకు అభం శుభం తెలియని సముద్రపు జీవులు బలైపోతున్నాయి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube