ఆక్టోపస్ కి అడ్డంగా దొరికిపోయిన గ్రద్ద

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వింత సంఘటలతో పాటు, ఆశ్చర్యకరమైన ఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

 Octopus Eagle Fish River Villagers-TeluguStop.com

ఆకాశంలో ఎగిరే గ్రద్దలు చెరువులలో చేపలని, ఇతర జీవులని వేటాడుతూ ఉంటాయి.అలా వేటాడే సమయంలో చేపలు తిరిగే ప్రాంతాన్ని పసిగట్టి ఒడుపుగా వాటిని పట్టుకుంటాయి.

ఇలాంటి సంఘటన కెనడాలోని కెనడాలోని వాన్కూవర్ ద్వీపంలో చోటు చేసుకుంది.అయితే ఈ సంఘటనలో ఊహించని విధంగా గ్రద్దకి షాక్ తగిలింది.

ఓ చేపల చెరువు పై నుంచి వెళ్తున్న గ్రద్దకి నీటిపై తేలుతూ ఉన్న ఆక్టోపస్‌ కనిపించింది.ఆక్టోపస్‌ను ని పట్టుకొని ఆకలి తీర్చుకోవాలని అనుకున్న గ్రద్దకి చుక్కెదురైంది.

గ్రద్ద నీటిపైకి వచ్చిన వెంటనే ఆక్టోపస్ గద్ద రెక్కలను తన టెన్టకిల్స్‌తో బంధించింది.దీంతో గ్రద్ద ఎటు కదలలేక అలాగే ఉండిపోయింది.

తప్పించుకునే ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు.కొద్ది సేపట్లో నీటిలో మునిగిపోతుందనుకునే సమయానికి అక్కడ శబ్దం విని ఆ సంఘటన చూసిన కొంత మంది ఆక్టోపస్ నుంచి గ్రద్దని కాపాడారు.

అక్కడున్నవారు పెద్ద కర్రతో గద్ద రెక్కల చుట్టూ ఉన్న టెన్టకిల్స్‌ను తొలగించడంతో గ్రద్ద అక్కడి నుంచి ఎగిరిపోయి పక్కనే ఉన్న చెట్టు మీద వాలి ఊపిరి తీసుకుంది.ఈ సంఘటన సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా మంది ఆసక్తిగా షేర్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube