వీడియో : బతికి ఉన్న జంతువును తినాలనుకున్న అమ్మాయికి ఏం జరిగిందో తెలిస్తే ఒల్లు గగుర్లు పొడవడం ఖాయం

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ది అన్న సామెత తెల్సిందే.అంటే ఒకొక్కరు ఒక్కో రుచిని కోరుకుంటే, ఒకొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తారు అని అర్థం.

 Octopus Attached To A Womans Face In Livestream China-TeluguStop.com

అందరు ఒకలా ఆలోచిస్తే తన ప్రత్యేకత ఏముంది, తాను చాలా ప్రత్యేకం అని నిరూపించుకునేందుకు కొందరు చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు.అలాంటి సమయంలో వారు ప్రమాదంకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

కొన్ని సంఘటనలు ఫన్నీగా అనిపించినా కూడా కొన్ని సంఘటనలు మాత్రం అత్యంత భయాందోళన కరంగా ఉంటాయి.మరి కొన్ని ఒల్లు గగుర్లు పొడిచే విధంగా ఉంటుంది.

తాజాగా చైనాకు చెందిన ఒక అందమైన యువతి చిలిపి పని చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంది

చైనా జనాలు ఎలాంటి ఆహారంను తింటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సముద్ర జీవులను ఎక్కువగా వీరు ఇష్టపడతారు.

ఆక్టోఫస్‌ వంటలకు చైనాలో మంచి డిమాండ్‌ ఉంది.అయితే పచ్చి ఆక్టోఫస్‌ తినాలనే ఆలోచన ఒక అమ్మాయికి వచ్చింది.

వచ్చిందే తడవుగా ఒక ఆక్టోఫస్‌ను సంపాదించింది.దాంతో ఆమె తన ప్రయోగం చేయాలని భవించింది.

అది కాస్త పెద్దగా అయ్యింది.అయినా పర్వాలేదు, ఏం కాదని భావించింది.

ఆ ఆక్టోఫస్‌ బతికి ఉంది.కదులుతున్న ఆక్టోఫస్‌ను కొరికి నమిలి తినేందుకు మొదలు పెట్టింది.అయితే ఈలోపు అది కాస్త తన సహజమైన బంధనాలతో ఆమె మొహం మరియు బుగ్గలను పట్టి పీకడం మొదలు పెట్టింది

ఈ వ్యవహారం అంతా కూడా ఆమె లైవ్‌ రికార్డింగ్‌ పెట్టుకుంది.లైవ్‌లో అక్టోఫస్‌ను తినడం అంతా చూడాలనుకుంది.కాని అది కాస్త ఎదురు దాడి చేయడంతో ఆమె మొహం రక్తశిక్తం అయ్యింది.దాని నుండి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నించింది.చివరకు రక్తం ఒడ్డి మరీ ఆమె ఆక్టోఫస్‌ నుండి తప్పించుకుంది.ఈ అమ్మడు చేసిన పనికి సోషల్‌ మీడియాలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

ఒల్లు గగుర్లు పొడిచే విధంగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.దీన్ని మీరు ఒక లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube