అక్టోబర్ నెలలో బ్యాంకు కు ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసా?

ప్రస్తుతం కోవిడ్ కాలం నడుస్తుంది.కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది మృతి చెందారు.

 Bank Holidays In October Month, Bank Holidays, October Month, Gandhi Jayanthi, D-TeluguStop.com

ఇక ఈ మహమ్మారి వల్ల సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో ప్రజలు తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు.ఇక బ్యాంకుల ద్వారా కరోనా వైరస్ ఎక్కువ విజృంభిస్తుండటంతో బ్యాంకు సమయాల్లో అనేక మార్పులు వచ్చాయ్.

అందుకే ఎంతోమంది బ్యాంకులకు వెళ్లకుండానే ఆన్లైన్ లో చెల్లింపులు చేస్తున్నారు.ఇక పరిమిత సమయం మాత్రమే బ్యాంకులు పని చెయ్యడం వల్ల బ్యాంకు కు ఏ రోజు సెలవు ఇస్తారు అనేది ముందుగానే గమనించాలి.

అందుకే మిగితా నెలలతో పోలిస్తే అక్టోబర్ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయ్ అనేది ముందుగానే తెలుసుకుంటే మంచిది.అప్పుడు సమయం వృధా అవ్వకుండా ప్లాన్ చేసుకుంటే మంచిది.

ఇక అలానే ఈ నెలలో ఎప్పుడు సెలవులు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.నిజానికి మిగితా నెలలతో పోలిస్తే అక్టోబర్ నెలలో ఎక్కువగా సెలవులు ఉంటాయి.అక్టోబర్ నెలలో 10, 24 తేదీలు రెండు, నాలుగు శనివారాలు అందుకుగాను ఆ రెండు రోజులు సెలవులు ఉంటాయి.4, 11, 18, 25 తేదీలు ఆదివారాలు అందుకుగాను ఆరోజులు బ్యాంకులకు సెలవు ఉంటాయ్.ఈ సెలవలు మాత్రమే కాకుండా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా, అక్టోబర్ 30వ తేదీన మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా సెలవులు ఉన్నాయ్.ఇక దసరా పండుగ సెలవులు ఉంటాయి.

అయితే ఆ పండగ కూడా శనివారం, ఆదివారం రావడంతో బ్యాంకు ఖాతాదారులకు ఎటువంటి సమస్య ఉండదు.పండగలు ఈ నెలలో ఎక్కువ ఉండటం వల్ల బ్యాంకు లావాదేవీలు జోరుగా జరుగుతాయ్.

కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుంటే బ్యాంకు పనులలో ఎలాంటి ఆటంకం కలగదు!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube