ఓవర్‌సీస్ సిటిజన్ కార్డు దరఖాస్తు విధానం ఇకపై మరింత సులభం

ఓవర్‌సీస్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త.అప్లికేషన్ విధానానికి ఉన్న సంక్షిష్టమైన ప్రక్రియలను సులభరం చేస్తూ వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటన జారీ చేస్తుంది.

 Ociapplication Process Is Simplified Inusa-TeluguStop.com

గతంలో ఓవర్‌సీస్ సిటిజన్ కార్డ్ కావాల్సిన వారు గతంలో పార్ట్-ఏ, పార్ట్-బిగా రెండు దశల్లో దరఖాస్తు చేయాల్సి వుంటుంది.

Telugu Oci Process, Ociprocess, Telugu Nri Ups-

  అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం కేవలం పార్ట్-ఏను పూర్తిచేస్తే చాలు.భారత ప్రభుత్వ ఓసీఐ సర్వీస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూరించాలి.అనంతరం దానితో పాటుగా సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేస్తే చాలు.
వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయంతో పాటు న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్, అట్లాంటా, చికాగో‌లలో ఉన్న భారత కాన్సులేట్ ఆఫీసులలో సైతం ఓవర్‌సిస్ సిటిజన్ కార్డ్ దరఖాస్తులను అందజేయవచ్చని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ నింపిన తర్వాత దానిని ప్రింట్ తీసి సంబంధిత పత్రాలు జత చేసి కింగ్స్ గ్లోబల్ సర్వీసెస్‌ కార్యాలయాల్లో సైతం అందజేయవచ్చునని అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube