అక్కడ సోషల్ మీడియా సర్వీసులను నిలిపివేస్తామంటున్న సంస్థలు...

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా సర్వీసులైనటువంటీ ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్, వంటి వాటిని స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు.అయితే ఇందులో కొంతమంది వీటిని ఉపయోగించి మంచి పనులు చేస్తుంటే, మరికొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తుంటారు.

 Ocial Media Providers Decided To Stop Their Services In Pakistan-TeluguStop.com

అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుత మానవ జీవితంలో సోషల్ మీడియా అనేది కీలక పాత్ర వహిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇస్లామిక్ దేశాల్లో ఒకటైనటువంటి పాకిస్థాన్ దేశంలో సోషల్ మీడియా సంబంధిత సర్వీసులను నిలిపివేయాలని కొన్ని సోషల్ మీడియా సంస్థలు అనుకుంటున్నట్లు సమాచారం.

అయితే అందుకు కారణాలు లేకపోలేదు.ఈ కారణాల్లో పాకిస్థాన్ దేశ ప్రభుత్వం విధించినటువంటి కఠిన నియమాలు ముఖ్య కారణాలుగా చెప్పుకుంటున్నారు.అయితే ఇందులో పాకిస్థాన్ దేశంలో సోషల్ మీడియా సర్వీసులను అనుమతించాలంటే ముందుగా ఈ దేశ భద్రతకు సంబంధించి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.ఇందులో ముందుగా ఈ సర్వీసు సంస్థకి సంబంధించినటువంటి భద్రతా కార్యాలయాన్ని దేశంలో నెలకొల్పాలి.

Telugu Face, Google, Pakistan, Latest, Providers, Whats App-Latest News - Telugu

అంతే కాకుండా అక్కడ అధికార సిబ్బందిని నియమించి దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని మానిటరింగ్ చేస్తూ ఒకవేళ ఎవరైనా యూజర్లు దొంగిలించబడిన లేదా ఇతర దేశాలకి అమ్మడం వంటివి జరిగితే వెంటనే గుర్తించి ఆ వినియోగదారుడి యొక్క వివరాలను పాకిస్తాన్ గవర్నమెంట్ అధికారులకి అందజేయవలసి ఉంటుంది.ఒకవేళ సోషల్ మీడియా సంస్థ అధికారులు ఈ నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దీంతో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, గూగుల్, వంటి సంస్థలు ఈ జరిమానాలను కట్టలేక పోతున్నాయి.అంతేగాక తమ యూజర్ల డేటాను దుర్వినియోగం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.దీంతో ఈ ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు పాకిస్థాన్ దేశం ఈ కఠిన నియమాలను సడలించుకోక పోతే తొందర్లోనే తమ సర్వీసులను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.మరి పాకిస్థాన్ దేశ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube