ఓసీఐ కార్డ్ రెన్యువల్ గడువు పెంచండి: భారత ప్రభుత్వానికి ఇండో-అమెరికన్ల విజ్ఞప్తి  

Indian-american Social Activist Has Urged The Government Of India - Telugu Government Of India, Indian-american Social Activist, Nri, Oci Card Renewal Till December 31, Telugu Nri News Updates

అమెరికాలో ఓసీఐ కార్డు ఉన్న భారత సంతతి పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా భారతీయ- అమెరికన్ సామాజిక కార్యకర్త దాని రెన్యువల్ తేదీని డిసెంబర్ 31 వరకు పొడిగించాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు విదేశాల్లో స్దిరపడిన భారత సంతతి వ్యక్తులకు భారత్‌ను సందర్శించడంతో పాటు పలు రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

Indian-american Social Activist Has Urged The Government Of India - Telugu Government Of India, Indian-american Social Activist, Nri, Oci Card Renewal Till December 31, Telugu Nri News Updates-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్లు (20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులేని వారు) పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకున్నప్పుడల్లా తప్పనిసరిగా రద్దు చేసిన పాత పాస్‌పోర్ట్‌ తీసుకురావాలని భారత విదేశాంగ శాఖలోని ఫారినర్స్ డివిజన్‌ తెలిపిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో వారి కార్డును పునరుద్దరించడానికి జూన్ 30 వరకు గడువు విధించారు.

దీనిపై భారతీయ-అమెరికన్లు, ఎన్ఆర్ఐల నుంచి వస్తున్న స్పందన ఆధారంగా ఇండో అమెరికన్ సామాజిక వేత్త ప్రేమ్ భండారి మాట్లాడారు.కార్డు పునరుద్దరణకు జూన్ 30 వరకు ఇచ్చిన సమయం సరిపోదన్నారు.

ఎందుకంటే దీనిపై ప్రభుత్వం నుంచి అవగాహన, ప్రచారం కల్పించాల్సి ఉందన్నారు.అందువల్ల ఓసీఐ కార్డుల పునరుద్దరణ తేదీని 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని ఆయన భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

కాగా ఈ వారం న్యూయార్క్‌లోని ఇండియన్ ఎంబసీతో పాటు ఇతర భారతీయ దౌత్య మిషన్‌లు ఓసీఐ పునరుద్దరణపై వివరణ ఇచ్చాయి.చాలా మంది ఓసీఐ కార్డులను పునరుద్దరించకపోగా.పాత పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండకపోవడంతో విమానయాన సంస్థలు వారిని బోర్డింగ్ సమయంలోనే నిలిపివేస్తున్నాయి.దీనితో భారత సంతతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజా వార్తలు