టిక్‌టాక్‌ను నిషేధించిన యూఎస్ ఆర్మీ

వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్‌కు యూఎస్ ఆర్మీ షాకిచ్చింది.భద్రతా కారణాల రీత్యా సైనికులు ఈ యాప్‌ను వాడకుండా నిషేధించింది.

 Ochova Us Soldiers Using Tiktok-TeluguStop.com

చైనాకు చెందిన వస్తువులు జాతి భద్రతకు ముప్పు కలిగించవచ్చునని, లేదా అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం వుందని మిలటరీ.కామ్ గతంలో హెచ్చరించింది.

టిక్‌టాక్‌ను ఉపయోగించడం ద్వారా భద్రతా పరమైన ఇబ్బందులను ఎదుర్కొవాల్సి రావొచ్చునని తాము గుర్తించినట్లు ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రాబిన్ ఎల్ ఓచోవా తెలిపారు.

డిసెంబర్ 16న యూఎస్ మిలిటరీకి సైబర్ అవేర్‌నెస్ మేసేజ్ ద్వారా తాము టిక్ టాక్ గురించి తెలియజేశామని ఓచోవా వెల్లడించారు.

వ్యక్తిగత సమాచార రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని, డౌన్‌లోడ్ చేసే యాప్‌లలో ఏది మన డేటాను మానిటర్ చేస్తుందో సైనికులు గుర్తించాలని.అటువంటి అప్లికేషన్లను వెంటనే అన్‌ ఇన్‌స్టాల్ చేయాలని ఆ మేసేజ్ తెలిపింది.

Telugu Telugunri, Tiktok, Soldiers Tiktok-

కాగా గత డిసెంబర్‌లో యూఎస్ నేవి కూడా టిక్‌టాక్ యాప్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే.ఒకవేళ ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే వారిని నేవి ఇంట్రానెట్ నుంచి తొలగిస్తామని హెచ్చరించింది.గత కొద్దిరోజులుగా చైనాకు చెందిన టెక్ దిగ్గజాలపై అమెరికా అనుమానాలను వ్యక్తం చేస్తోంది.ఇప్పటికే హువావే‌ తన ఉత్పత్తుల ద్వారా చైనాకు గూఢచార్యం చేస్తోందని ట్రంప్ సర్కార్ భావించింది.

అంతేకాకుండా హువావే అధినేత కుమార్తెను కెనడాలో అరెస్ట్ చేయించింది.అయితే టిక్ టాక్.

హువావేతో పోలిస్తే భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు.ఇది కేవలం చిన్న వారి నుంచి పెద్దవారికి సంబంధించిన వీడియోలను షేర్ చేయడం మాత్రమే చేస్తుందని వారు అంటున్నారు.

Telugu Telugunri, Tiktok, Soldiers Tiktok-

యాప్ అనలిటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ గణాంకాలను పరిశీలిస్తే.ప్రారంభమైన రెండేళ్లలోనే టిక్ టాక్‌ను సుమారు 750 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపింది.అదే సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్ చాట్‌ కంటే పది లక్షల డౌన్‌లోడ్‌లు అదనంగా టిక్‌టాక్ సంపాదించగలిగింది.మరోవైపు 13 సంవత్సరాల లోపు పిల్లల నుంచి పేర్లు, ఈమెయిల్స్, తదితర వ్యక్తిగత సమాచారాన్ని చట్టవిరుద్ధంగా సేకరించిన అభియోగంపై టిక్ టాక్‌పై 5.7 బిలియన్ డాలర్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube