ఇప్పుడు తెలిసిందా?

ఇండో-కెనడియన్‌ పోర్‌్న స్టార్‌ సన్నీలియోనీ అశ్లీల చిత్రాల్లో (పెద్దలు మాత్రమే చూడదగ్గ చిత్రాలు) నటించే నటి అని ముంబయికి చెందిన ఓ గృహిణికి ఇప్పుడే తెలిసింది.ఆమె ఇంటర్‌నెట్‌ చూస్తూవుంటే సన్నీలియోన్‌ బొమ్మలు కనబడ్డాయట.ఏమిటీ…సన్నీలియోనీ ఇంత ఛండాలపు సినిమాల్లో నటిస్తుందా? ఈమె చరిత్ర ఇదా? అని ఆశ్చర్యపడి, కోపం తెచ్చకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇంటర్నెట్లోని సన్నీలియోని బొమ్మలు, వీడియోలు ప్రజల బుర్రలను పాడుచేస్తాయని, ముఖ్యంగా పిల్లలు చెడిపోతారని ఆ ఇల్లాలు తన ఫిర్యాదులో పేర్కొంది.

 Obscenity Case Against  Sunny Leone-TeluguStop.com

అయితే ‘ఏక్‌ పహెలీ లీల’ అనే చిత్రంలో నటించిన సన్నీలియోనీపై ఇన్‌పర్మేషన్‌ టెక్నాలజీ చట్టం కింద కేసు పెట్టామని పోలీసులు ఆమెకు వివరించారు.ఈ అశ్లీల చిత్ర తారపై ఇండీసెంట్‌ రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ఉమెన్‌ యాక్‌్ట కింద కూడా కేసు నమోదు చేశారట.

సన్నీలియోనీ గురించి ముంబయి ఇల్లాలు చాలా ఆలస్యంగా తెలుసుకుంది.ఈ పెద్దల చిత్రాల తార ఇప్పటికే చాలా భారతీయ సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలుసు.

ఆమె చరిత్ర తెలుసుకొనే ఆమెను సినిమాల్లోకి ఆహ్వానించింది బాలీవుడ్‌ పరిశ్రమ.కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు కుమారుడు మంచు మనోజ్‌ కూడా తన సొంత సినిమా కరెంటు తీగలో సన్నీలియోనీని నటింపచేశాడు.

మన చిత్ర పరిశ్రమే ఆమెను అక్కున చేర్చుకున్నప్పుడు ఆ ఇల్లాలు ఎందుకో అసహ్యించుకుంటోంది.కాలంతో పాటు విలువలు కూడా మారుతాయి.ఇది పోర్‌్న స్టార్‌లను ఆరాధించే కాలం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube