ఉత్తర ప్రదేశ్ రామ్ లీలా వేదికపై అశ్లీల నృత్యలు.. వీడియో వైరల్..

మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన దేశస్తులు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు.దసరా పండుగ సందర్భంగా నవరాత్రులలో తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు భక్తులు.

 Obscene Dances On Uttar Pradesh Ram Leela Stage.. Video Viral.. ,obscene Dances-TeluguStop.com

అలా పూజలు చేస్తూ కఠినమైన ఉపవాసాలను పాటిస్తూ ఉంటారు.కొన్ని ప్రాంతాలలో రాత్రి సమయంలో కూడా పూజలు చేస్తూ భక్తిశ్రద్ధలతో మంచి కార్యక్రమాలు చేస్తూ పండగ జరుపుకోవడం మన దేశంలోని సంస్కృతి.

కానీ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్జోయ్ ప్రాంతంలోని రామ్ లీలా సందర్భంగా వేదికపై అశ్లీల నృత్యం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.మంగళవారం రాత్రి రాంలీలా వేదికపై అశ్లీల నృత్యం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆ ప్రదేశానికి చేరుకుని, రామ్‌లీలా కమిటీకి చెందిన 10 మంది సభ్యులు, బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పన్వాసాకు చెందిన డ్యాన్సర్లపై కేసు నమోదు చేశారు.

 Obscene Dances On Uttar Pradesh Ram Leela Stage.. Video Viral.. ,Obscene Dances-TeluguStop.com

పవిత్రమైన పండుగ సమయాలలో ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు.

ఈ వీడియోలో రావణుడి పాత్రధారి ముందు ఇద్దరు మహిళలు సినిమాల్లోని ఐటెం సాంగ్ కు అసభ్యకరమైన రీతిలో డ్యాన్స్ చేస్తున్నారు.

ఆ సమయంలో రావణుడిని ఆకర్శించేందుకు ఆ డ్యాన్సర్ ప్రయత్నిస్తున్నట్టు మనం ఆ వీడియోలో చూడవచ్చు.అయితే ఆమె డ్యాన్ చేసేటప్పుడు ప్రజలు గట్టిగా అరుస్తు ఎంకరేజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే రాంలీలా సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అనేక నగరాల్లో ఇలాంటి అశ్లీల నృత్యాలు సాధారణంగా జరుగుతుంటాయి.కాన్పూర్‌లోని హనుమంత్ బీహార్ చౌకీలో కూడా ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారింది.

అయితే అందులో పోలీసులు కూడా కనిపిస్తున్నారు.ఈ డ్యాన్స్ ను వారు చూసినప్పటికీ మౌనంగానే ఉండి వారు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

అలాగే కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలోని అక్బర్‌పూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన రామ్‌లీలాలో కూడా ఇలాంటి అశ్లీల నృత్యాలు చేస్తున్నారు.ప్రస్తుతం ఇలాంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఈ వీడియోలో చూసినవారు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు.పవిత్రమైన పండగ రోజులలో ఇలాంటి పనులు చేయడం వల్ల ఆ దుర్గామాత అస్సలు క్షమించదని కూడా కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube