కేజీఎఫ్2 టీజర్ పై అభ్యంతరం... వాటిని తొలగించాలని డిమాండ్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న కేజీఎఫ్2 సినిమా మీద దేశ వ్యాప్తంగా భారీ హైప్ ఉంది.తాజాగా హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా కేజీఎఫ్2 టీజర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.ఇక ఈ టీజర్ రిలీజ్ అయినా 48 గంటల్లోనే ఏకంగా వంద మిలియన్స్ వ్యూస్ ని క్రాక్ చేసి సంచలన రికార్డ్ నమోదు చేసింది.కేజీఎఫ్2 రికార్డుల వేట కొనసాగుతుంది.పవర్ ఫుల్ హీరో క్యారెక్టరైజేషన్ తో ఇందులో రాఖీభాయ్ పాత్రని ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడు.నెగిటివ్ హీరోయిజంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లో హీరో సిగరెట్ తాగే షాట్స్ కూడా పెట్టారు.

 Objection To Smoking Visuals In K.g.f Chapter 2 Teaser, Tollywood, Sandalwood,-TeluguStop.com

నిజానికి ఇండియన్ సినిమాలలో ఇలాంటి సిగరెట్ తాగే షాట్స్ తో ఎలివేషన్ సన్నివేశాలు కామన్ గా పెడుతూ ఉంటారు.ఇలాంటి సన్నివేశాలని ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

టీజర్, ట్రైలర్ లో కూడా ఇలాంటి షాట్స్ ని దర్శకులు సినిమా మీద హైప్ క్రియేట్ చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు.ఈ సిగరెట్ తాగే సన్నివేశాలపై ఎవరూ కూడా ఇప్పటి వరకు అభ్యంతరం చెప్పలేదు.

Telugu Yash, Prasanth Neel, Sandalwood, Tollywood-Movie

అయితే ఈ మధ్య కాలంలో సినిమాలలో ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంలో పెట్టి చూస్తున్న కొంత మంది ఏదో ఒక రూపంలో సినిమాని వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.ప్రతి చిన్న విషయానికి తమమనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.ఇప్పుడు కేజీఎఫ్2 విషయంలో ఇలాంటి సంఘాల నుంచి అభ్యంతరం రాకున్నా ప్రభుత్వ ఆరోగ్య శాఖ నుంచి అభ్యంతరాలు వచ్చాయి.టీజర్ లో హీరో పొగతాగే షాట్స్ యువతని ప్రేరేపించే విధంగా ఉన్నాయని, వాటిని తక్షణం తొలగించాలని నోటీసులు జారీ చేసింది.

ఇలాంటి దృశ్యాల వలన యువత చెడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.అయితే ఈ విషయాన్ని సినీ అభిమానులు మాత్రం తప్పుపడుతున్నారు.ప్రభుత్వం పొగాకు అమ్మకాలని నియంత్రించకుండా ఇలాంటి సన్నివేశాలని నియంత్రించే ప్రయత్నం చేసిన ప్రయోజనం ఉండదని విమర్శిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube