అమెరికా మాజీ అధ్యక్షుడి కొత్త అవతారం..!!!

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అంటే అమెరికన్స్ కి విపరీతమైన ఆదరణ ఉంటుంది.చిన్న వారి నుంచీ పెద్ద వారి వరకూ స్వదేశీయుల నుంచీ విదేశీయుల వరకూ అందరూ ఒబామా పరిపాలనపై సంతోషం వ్యక్తం చేసిన వారే.

 Obamas Christmas Gift Is New Avatar-TeluguStop.com

అయితే ఒబామా సైతం అందరికంటే కూడా ఒక భిన్నమైన శైలిలో వ్యవహరిస్తూ అమెరికా ప్రజలని ఆకట్టుకుంటూ ఉంటారు.అయితే ఈ సారి ఒబామా క్రిస్మస్ సందర్భంగా ఒక హాస్పిటల్ లోని చిన్నారులకి సర్ప్రైజ్ ఇచ్చాడు.

బరాక్‌ ఒబామా సాంటా క్లాజ్‌ వేషంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఒక్క సారిగా కలిసి వారిని ఆశ్యర్యపరిచారు.అసలేంటంటే…క్రిస్మస్‌ వేడుక సందర్భంగా వాషింగ్టన్‌లోని హాస్పిటల్‌కు సాంటా తరహాలో ఆయన వెళ్లారు.ఆ హాస్పిటల్‌ సిబ్బందికి ఒబామా శుభాకాంక్షలు చెప్తూనే అక్కడే చికిత్స పొందుతున్న చిన్నారులకు బహుమతలు ఇచ్చారు.

అమెరికాకు 44వ అధ్యక్షుడిగా చేసిన ఒబామా వాషింగ్టన్‌లోనేనివాసం ఉంటున్నారు.గతేడాది కూడా ఇలానే సాంటా వేషంలో ఒబామా వచ్చి ఆ స్కూల్ లో పిల్లలని ఆశ్చ్యర్య పరిచడమే కాకుండా ఎన్నో విలువైన భాహుమతులు సైతం పిల్లలకి ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube