వేలానికి ఒబామా వాడిన షూస్... ధర ఎంతో తెలిస్తే?

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి తెలియని వారుండరు.అప్పటి వరకు పనిచేసిన అమెరికా అధ్యక్షుల కంటే భిన్నంగా పరిపాలిస్తూ, వైట్ హౌస్ పాలన కాకుండా తన సాధారణ వ్యక్తిత్వంతో అమెరికా ప్రజల మన్ననలను చూరగొని రెండు సార్లు అమెరికాకు అధ్యక్షత వహించారు.

 Obama Used Shoes For Auction  What If The Price Is Too High , Obama, Viral News-TeluguStop.com

సరదాగా సామాన్య ప్రజలు షాపింగ్ చేసే ప్రాంతాల్లోనే కుటుంబ సభ్యులందరితో కలిసి షాపింగ్ చేసి, తరచూ ప్రజలతో తన పాలన గురించి అడుగుతూ ప్రజల అభిప్రాయాలను తీసుకుంటూ ముందుకెళ్లి రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహించాడు.ఇది ఒక వైపు అయితే ఒబామాకు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం.

అందుకే ఒబామా కోసం నైకీ కంపెనీ వారు షూస్ ని ప్రత్యేకంగా తయారుచేసి ఇచ్చారు.మొత్తం తెలుపు రంగులో ఉండి, ఆ షూస్ మీద ఒబామా సంతకంతో ఉండే ఆ షూస్ ని తాజాగా నైకీ కంపెనీ వేలం వేసింది.

ఒబామా వాడిన ఈ షూస్ కు వేలంలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.వీటి ధరను నైకీ సంస్థ 25 వేల యూఎస్ డాలర్లుగా నిర్ణయించింది.

అంటే మన రూపాయలలో చెప్పాలంటే 18 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉండొచ్చు.ధర కొంచెం ఎక్కువగా అనిపించినా ఒబామా స్థాయి లాంటి వ్యక్తులకు ఆ మాత్రం ధర ఉండొచ్చని నైకీ సంస్థ అభిప్రాయపడిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube