ట్రంప్ కి ఒబామా కౌంటర్ అదిరిపోయిందిగా..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నేటి వరకూ కూడా దూకుడు స్వభావాన్నే ప్రదర్శిస్తూ వచ్చారు.జాత్యహంకార వాదిగా పేరుతెచ్చుకున్న ట్రంప్, వలస దారులపై అనవసర వ్యాఖ్యలు చేయడం మొదలు, వారిని తమ దేశం విడిచి వెళ్లి పోవాల్సిందిగా, అనేక సార్లు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.

 Obama Tweet On Trump Govt-TeluguStop.com

అంతేకాదు అమెరికా ప్రజలచే ఎన్నుకోబడిన వలస డెమోక్రటిక్ నేతలపై కూడా ట్రంప్ అహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం కూడా ఎన్నో విమర్సలకి దారి తీసింది.అయితే

ట్రంప్ కి ఒబామా కౌంటర్ అదిరిప�

ఈ పరిణామాల నేపధ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మొదటి సారిగా ట్రంప్ పాలనపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.ట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఆఫ్రికన్ అమెరికన్లు వాషింగ్టన్ పోస్ట్ లో రాసిన కధనంపై స్పందించారు.

అంతేకాదు వారి మనోభావాలాని గౌరవిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు.తన పాలనలో ఈ బృందం సభ్యులు సాధించిన విజయాలు కృషి పై నేను తలుచుకుంటూ ఎప్పుడూ గర్వ పడుతూనే ఉంటాను అంటూ తెలిపారు.

అమెరికా సంక్షేమం కోసం ఎంతగానే పోరాటం చేస్తున్నారని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.ఇదిలాఉంటే మేము ఆఫ్రికన్ వాసులం ,దేశ భక్తులం చేతగాని వారిలా కాకుండా ఉద్యమిస్తాం అంటూ ఒబామా పాలకవర్గంలోని దాదాపు 148 మంది సభ్యులు ట్రంప్ జాత్యహంకారంపై వ్యాసం ప్రచురించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube