60వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమైన ఒబామా.. వైన్ యార్డ్‌లో భారీగా ఏర్పాట్లు, నెటిజన్ల విమర్శలు

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ బుధవారం 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.దేశంలో డెల్టా వేరియెంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయన తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరపాలని భావిస్తున్నారు.

 Obama Plans Big 60th Birthday Party In Marthas Vineyard As Threats Of Delta Variant Continue-TeluguStop.com

మార్తాస్ వైన్‌యార్డ్ ఇందుకు వేదిక కానుంది.మసాచుసెట్స్‌లో వున్న ఈ 30 ఎకరాల వ్యవసాయ క్షేత్రానికి భారీగా సన్నిహితులను ఆహ్వానించాలని ఒబామా భావిస్తున్నారు.

ఓప్రా విన్‌ఫ్రే, జార్జ్ క్లూనీ వంటి తారలకు ఇన్విటేషన్లు వెళ్లే అవకాశం వుందని సమాచారం.ఒబామా పుట్టినరోజు వేడుకల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

 Obama Plans Big 60th Birthday Party In Marthas Vineyard As Threats Of Delta Variant Continue-60వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమైన ఒబామా.. వైన్ యార్డ్‌లో భారీగా ఏర్పాట్లు, నెటిజన్ల విమర్శలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ఈ ఈవెంట్‌కు వచ్చే అతిథులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాటు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకుని వుండాలని షరతు పెట్టినట్లుగా సమాచారం.

ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామా 2019లో 11.75 మిలియన్ డాలర్ల వ్యయంతో ఈ వైన్ యార్డ్‌ను కొనుగోలు చేశారు.ఇది ద్వీపంలోని ఎడ్‌గార్టౌన్ విభాగంలో వుంటుంది.

డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నందున టీకాలు వేసుకున్నప్పటికీ మాస్క్‌లు ధరించాలని మసాచుసెట్స్ ప్రభుత్వం సూచించిన కొన్ని రోజులకే ఒబామా పుట్టినరోజు వేడుకలు జరుగుతుండటం గమనార్హం.

Telugu Cape Town Tourist, Charlie Baker, Chris Rock, George Clooney, Martha\\'s Vineyard, Michelle Obama, Musicians Jay Z, Obama, Obama Plans Big 60th Birthday Party In Marthas Vineyard As Threats Of Delta Variant Continue, Oprah Winfrey, Stevie Wonder, Tom Hanks-Telugu NRI

మీ సన్నిహితులు, కుటుంబసభ్యుల్లో ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో వున్నట్లయితే కోవిడ్ వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం వుందని మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్ గతవారం తెలియజేశారు.అందువల్ల ప్రతి ఒక్కరూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.అలాగే ప్రఖ్యాత కేప్‌గాడ్ టూరిస్ట్ కేంద్రంలో సైతం పర్యాటకులు ఖచ్చితంగా మాస్క్‌లను ధరించాలని స్థానిక అధికారులు బోర్డులను ఏర్పాటు చేశారు.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మంగళవారం జారీ చేసిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా మసాచుసెట్స్ ఈ ఆంక్షలను విధించింది.

కాగా, బరాక్ ఒబామా తన 50వ పుట్టినరోజు వేడుకలను 2011లో వైట్‌హౌస్‌లో జరుపుకున్నారు.

ఆ సమయంలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా వున్నారు.ప్రఖ్యాత సంగీతకారులు జే జెడ్, స్టీవీ వండర్, నటులు టామ్ హాంక్స్, క్రిస్ రాక్ వంటి ప్రముఖులు నాటి వేడుకలకు హాజరయ్యారు.

మరోవైపు ప్రస్తుతం దేశంలో కోవిడ్ తిరిగి విజృంభిస్తున్న పరిస్ధితుల్లో భారీ పుట్టినరోజు వేడుకలపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

#Chris Rock #Musicians Jay #Stevie #George Clooney #Charlie Baker

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు