పర్యావరణం కోసం: ఒబామాను కలిసిన 16 ఏళ్ల స్వీడిష్ సంచలనం  

Obama Meets With Swedish Teen Climate Activist Greta Thunberg-nri,obama,obama Meets Greta Thunberg,swedish Teen Climate Activist Greta Thunberg,telugu Nri News Updates

గ్రేటా థన్‌బర్గ్ ఇప్పుడు ఈ పేరు అమెరికా మొత్తం మారుమోగుతోంది.కారణం నిండా 16 ఏళ్లు కూడా లేని ఈ బాలిక పర్యావరణాన్ని కాపాడాలంటూ రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుని అధికారిక నివాసం.వైట్ హౌస్ ముందు నిరసన చేపట్టి ప్రపంచం దృష్టిలో పడింది.ఈ క్రమంలో గ్రేటా మంగళవారం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు.

Obama Meets With Swedish Teen Climate Activist Greta Thunberg-nri,obama,obama Meets Greta Thunberg,swedish Teen Climate Activist Greta Thunberg,telugu Nri News Updates-Obama Meets With Swedish Teen Climate Activist Greta Thunberg-Nri Obama Thunberg Swedish Telugu Nri News Updates

ఇందుకు సంబంధించిన వీడియోను ఒబామా ఫౌండేషన్ విడుదల చేసింది.

Obama Meets With Swedish Teen Climate Activist Greta Thunberg-nri,obama,obama Meets Greta Thunberg,swedish Teen Climate Activist Greta Thunberg,telugu Nri News Updates-Obama Meets With Swedish Teen Climate Activist Greta Thunberg-Nri Obama Thunberg Swedish Telugu Nri News Updates

ఈ సందర్భంగా పర్యావరణ మార్పులపై వాషింగ్టన్, న్యూయార్క్‌లో చేపట్టిన నిరసన ప్రదర్శన గురించి ఒబామా అడిగి తెలుసుకున్నారు.పర్యావరణ పరిరక్షణపై జరిగే పోరాటంలో తాను నీతో కలిసి పనిచేస్తానని ఒబామా హామీ ఇచ్చారు.ఈ సమావేశం అనంతరం గ్రేటా గురించి ట్వీట్ చేసిన ఆయన.ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు.గట్టిగా 16 ఏళ్లు కూడా లేని గ్రేటా థన్‌బెర్గ్ భూగోళం తరపున గొప్ప న్యాయవాదుల్లో ఒకరని.వాతావరణ మార్పుల యెక్క దుష్ఫలితాలను ఆమె తరం ఎదుర్కొవాల్సి వస్తుందని గ్రేటా గుర్తించందని ఒబామా అన్నారు.

స్వీడిష్ పార్లమెంట్ బయట ఆందోళనతో ఒక్కసారిగా థన్‌బెర్గ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు పాటుపడాలని కోరుతూ 100 నగరాల్లో ఆమె విస్తృత ప్రచారం నిర్వహించేందుకు బయల్దేరింది.థన్‌బెర్గ్ పనితీరును గుర్తించిన ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 23న జరిగే క్లైమేట్ యాక్సన్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది.ఈ సదస్సులో ప్రసంగించే అవకాశం రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.