ఒబామా, హిల్లరీ లకి శక్తివంతమైన పేలుడు పదార్థాల పార్సిల్స్..  

Obama And Hillary Clinton Got Threat From Unknown Person-

అమెరికా మాజీ అధ్యక్షడు ఒబామా ,మాజీ విదేశాంగ శాఖామంత్రి హిల్లరీ లని చంపేందుకు గాను భారీ కుట్ర జరిగింది అయితే ఈ కుట్రని అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థ ఆదుకుంది. ఒక వేళ ఆ కుట్ర జరిగిఉంటే అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటన జరిగిపోయి ఉండేది. అయితే ఒబామాగానీ, హిల్లరీ క్లింటన్‌గానీ వీటిని స్వీకరించలేదని ఆ సీక్రెట్ సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Obama And Hillary Clinton Got Threat From Unknown Person-

Obama And Hillary Clinton Got Threat From Unknown Person

ఆ పార్సిల్స్ లో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఉన్నాయని, వాటిని నిర్వీర్యం చేశామని పేర్కొన్నది. సాధారణంగా చేపట్టే పార్శిల్ స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా వీటిని గుర్తించినట్టుగా సంస్థ తెలిపింది. ఒబామా పేరు మీద వచ్చిన పార్శిల్‌ను వాషింగ్టన్ డీసీలో బుధవారం ఉదయంక్లింటన్ పేరిట వచ్చిన పార్శిల్‌ను న్యూయార్క్‌లోని వెస్ట్‌చెస్టర్ కౌంటీలో మంగళవారం అడ్డుకున్నట్టు అధికారులు తెలిపారు.

Obama And Hillary Clinton Got Threat From Unknown Person-

ఈ ఘటనలపై ఎఫ్‌బీఐ తీవ్రంగా స్పందించింది అందుకు గల కారణాలు ఏమిటి అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. కాగా తమకు కూడా అనుమానాస్పద పార్శిల్ వచ్చిందనిదీంతో న్యూయార్క్ బ్యూరో కార్యాలయం ఖాళీ చేసినట్టు సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తెలిపింది…ఈ ఘటనని వైట్ హోస్ ఖండించింది ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించాలని అధికారులని ఆదేశించింది.