మొటిమ‌ల‌కు చెక్ పెట్టే ఓట్స్.. ఎలాగో తెలుసా?  

oats help to get rid of pimples! oats, pimples, beauty, beauty tips, latest news, skin care, Oats Powder for pimples - Telugu Beauty Tips, Latest News, Oats, Oats Help To Get Rid Of Pimples! Oats, Oats Powder For Pimples, Pimples, Skin Care

ఓట్స్‌.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

TeluguStop.com - Oats Help To Get Rid Of Pimples

ముఖ్యంగా బ‌రువు త‌గ్గాల‌నుకేనే ఖ‌చ్చితంగా వారి డైట్‌లో ఓట్స్‌ను చేర్చుకుంటారు.శ‌రీరంలో అధిక కొలెస్ట్రాల్ త‌గ్గించ‌డంలోనూ, గుండె జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డంలోనూ, బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు చేయ‌డంలోనూ ఓట్స్ అద్భుతంగా ప‌ని చేస్తాయి.

అంతే కాదండోయ్‌.చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలో.

TeluguStop.com - మొటిమ‌ల‌కు చెక్ పెట్టే ఓట్స్.. ఎలాగో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా మొటిమ‌ల‌ను నివారించ‌డంలో సైతం ఓట్స్ స‌హాయ‌ప‌డ‌తాయి.
మ‌రి ముఖానికి ఓట్స్‌ను ఎలా ఉప‌యోగించాలి? అన్న‌ది ఇప్ప‌డు తెలుసుకుందాం.ముందుగా ఓట్స్‌ను పౌడ‌ర్ చేసి పెట్టుకోవాలి.ఇప్ప‌డు ఒక బౌల్ తీసుకుని.అందులో ఓట్స్ పౌడ‌ర్‌, పెరుగు మ‌రియు ట‌మాటా ర‌సం వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుతుంది.

మ‌రియు మొటిమ‌ల వ‌ల్ల వ‌చ్చే మ‌చ్చ‌లు కూడా త‌గ్గుతాయి.అలాగే ఒక బౌల్‌లో ఓట్స్ పౌడ‌ర్, తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.అర‌గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారినికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గ‌డంతో పాటు చ‌ర్మం ప్ర‌కాశవంతంగా మారుతుంది.

అలాగే ఒక బౌల్‌లో ఓట్స్ పౌడ‌ర్‌, ప‌సుపు మ‌రియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు బాగా అప్లై చేయాలి.బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మొటిమ‌లు త‌గ్గుతాయి.అలాగే ముఖంపై ఉన్న మృత‌క‌ణాలు తొల‌గి.

చ‌ర్మం గ్లోగా మారుతుంది.కాబ‌ట్టి, ఈ సింపుల్ టిప్స్‌ను మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

#OatsHelp #OatsPowder #Beauty Tips #Pimples #Skin Care

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Oats Help To Get Rid Of Pimples Related Telugu News,Photos/Pics,Images..