రివ్యూ : ‘ఓ పిట్టకథ’ మెప్పించిందా?  

o pitta katha movie review - Telugu Nitya Shetty, O Pitta Katha Movie Collections, O Pitta Katha Movie Talk, O Pitta Katha Rating, O Pitta Katha Review, Sanjay Rao, Viswant, ఓ పిట్టకథ రివ్యూ

ఈమద్య కాలంలో ఒక చిన్న సినిమాకు ఈ స్థాయిలో పబ్లిసిటీ దక్కడం ఇదే ప్రథమం అయ్యి ఉంటుంది.మెగాస్టార్‌.

TeluguStop.com - O Pitta Katha Movie Review

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

సూపర్‌ స్టార్‌ నుండి చిన్న హీరో వరకు అంతా కూడా ఈ చిత్రంకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడంతో పాటు ఏదో ఒక విధంగా ప్రమోషన్‌లో భాగస్వామ్యం అయ్యారు.బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

TeluguStop.com - రివ్యూ : ‘ఓ పిట్టకథ’ మెప్పించిందా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కనుక బ్రహ్మాజీ తనకున్న పరిచయాలతో సినిమాకు ఓ రేంజ్‌లో పబ్లిసిటీ చేయించాడు.మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఒక ఊర్లో ప్రభు(సంజయ్‌) అనే కుర్రాడు ఉంటాడు.అతడు చిన్నప్పటి నుండి కూడా వెంకటలక్ష్మి(నిత్యశెట్టి) అంటే ఇష్టంతో పెరుగుతాడు.

వెంకటలక్ష్మి కూడా ప్రభును ఇష్టపడుతుంది.ప్రభు ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది.

అదే సమయంలో ఊర్లోకి క్రిష్‌ ఎంటర్‌ అవుతాడు.క్రిష్‌ కూడా వెంకటలక్ష్మిని ప్రేమిస్తాడు.

ఇద్దరు కూడా ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.అప్పుడే వెంకటలక్ష్మిని విలన్‌ కిడ్నాప్‌ చేస్తాడు.

ఇంతకు ఆ కిడ్నాపర్‌ ఎవరు? ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ చివరకు ఏమైంది అనేది ఈ పిట్ల కథ చూస్తే తెలుస్తుంది.

నటీనటుల నటన :

హీరోగా పరిచయం అయిన సంజయ్‌ రావు మెప్పించాడు.కొన్ని సీన్స్‌లో నటనతో మెప్పించిన సంజయ్‌ ఎమోషనల్‌ సీన్స్‌లో ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో ఇంకాస్త మెరుగు పడాల్సి ఉంది.ఇక హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలో కూడా ఎక్స్‌ప్రెషన్స్‌ మార్చుకోవాలి.

మొత్తంగా చూస్తే సంజయ్‌ హీరోగా రాణించాలంటే ఇంకాస్త కష్టపడాలి.ఇక విశ్వంత్‌ క్యూట్‌ లుక్‌తో మెప్పించాడు.

విభిన్నమైన నటనతో ఆకట్టుకున్నాడు.ఇక హీరోయిన్‌ నిత్యశెట్టి పక్కా పల్లెటూరు అందమైన అమ్మాయిగా కనిపించి మెప్పించింది.

పక్కింటి పిల్ల మాదిరిగా కనిపించిన నిత్య శెట్టి నటన పరంగా కూడా పర్వాలేదు అనిపించింది.బ్రహ్మాజీ పోలీస్‌గా ఆకట్టుకునే నటన కనబర్చాడు.

ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించారు.

టెక్నికల్‌ :

పాటల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.ఒకటి రెండు పాటలు సో సోగా ఉన్నాయి.పాటల గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.

నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు అన్నట్లుగా సాగింది.సీన్స్‌ను ఎలివేట్‌ చేసే స్థాయిలో నేపథ్య సంగీతం ఏమీ లేదు.

ఎడిటింగ్‌లో లోపాలున్నాయి.కొన్ని సీన్స్‌ ప్లేస్‌మెంట్‌ సరిగా లేదు.

పల్లె అందాలను చూపడంలో సినిమాటోగ్రఫీ బాగా పని చేసింది.దర్శకుడు కథనం విషయంలో ఇంకాస్త బెటర్‌గా రాసుకుంటే బాగుండేది.

నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.

విశ్లేషణ :

దర్శకుడు చందు ఒక సింపుల్‌ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీని విభిన్నంగా చూపించేందుకు ప్రయత్నించాడు.ప్రేమ కథలో కిడ్నాప్‌ డ్రామాను పెట్టి కథను ఆసక్తికరంగా నడిపించేందుకు ప్రయత్నించాడు.అయితే స్క్రీన్‌ప్లే విషయంలో దర్శకుడు నిరాశ పర్చాడని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ లోపించడంతో పాటు కొన్ని లాజిక్‌ లేని సీన్స్‌ మద్య మద్యలో వచ్చాయి.బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌ హీరోగా మరిన్ని సినిమాలు చేసి హిట్‌ కొట్టాలి అంటే చాలా కష్టపడాల్సిందే.

ముఖ్యంగా ఎక్స్‌ప్రెషన్స్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.భారీగా ప్రమోట్‌ చేసిన ఈ సినిమాపై జనాల్లో అంచనాలు భారీగా పెరిగాయి.

అయితే ఆ స్థాయిలో అంచనాలను అందుకోలేక పోయింది ఈసినిమా.

ప్లస్‌ పాయింట్స్‌ :

కథలో ట్విస్ట్‌,
పల్లె అందాలు,
హీరోయిన్‌ నిత్యశెట్టి గ్లామర్‌

మైనస్‌పాయింట్స్‌ :

సంగీతం,
స్క్రీన్‌ప్లే,
ఎడిటింగ్‌,
కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లోపించడం.

బోటమ్‌ లైన్‌ : ఓ పిట్టకథ లో ట్విస్ట్‌ బాగుంది.

రేటింగ్‌ : 2.75/5.0

.

#Viswant #OPitta #OPitta #OPitta #Sanjay Rao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

O Pitta Katha Movie Review Related Telugu News,Photos/Pics,Images..