'ఓ బేబీ' రిపేర్లు.. సురేష్‌ బాబుకు ధైర్యం చాలడం లేదా  

O Baby Movie Going To Get Small Repairs Says To Suresh Babu-o Baby Movie Release Date,producer Suresh Babu,samantha

ఇటీవలే నిర్మాత సురేష్‌ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం తమ బ్యానర్‌లో దాదాపు 10 సినిమాల వరకు తెరకెక్కుతున్నాయి. వివిధ నిర్మాణ సంస్థలతో కలిసి ఒప్పందం చేసుకుని సినిమాలను నిర్మిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ సినిమాల్లోంచి ఏబీసీడీ మరియు ఫలక్‌నుమా దాస్‌ చిత్రాలు వచ్చేశాయి. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్కా బోర్లా పడ్డాయి..

'ఓ బేబీ' రిపేర్లు.. సురేష్‌ బాబుకు ధైర్యం చాలడం లేదా-O Baby Movie Going To Get Small Repairs Says To Suresh Babu

దాంతో తర్వాత సినిమా విషయంలో నిర్మాత సురేష్‌ బాబు ఛాన్స్‌ తీసుకోవాలనుకోవడం లేదు. గత రెండు సినిమాలను పెద్దగా పట్టించుకోకుండా రిలీజ్‌ చేసిన సురేష్‌బాబు ప్రస్తుతం ‘ఓబేబీ’ సినిమా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం జులై నెలలో రాబోతుంది. తాజాగా ఫైనల్‌ కట్‌ వర్షన్‌ చూసిన తర్వాత నిర్మాత సురేష్‌ బాబు రీ షూట్‌తో పాటు, రీ ఎడిట్‌ కూడా ఆదేశించాడట. సినిమాలో కొన్ని సీన్స్‌ ఆయన్ను సంతృప్తి పర్చలేదని తెలుస్తోంది.

దాంతో మళ్లీ మొదటి నుండి ఎడిట్‌ చేయడంతో పాటు, సమంత మరియు రావు రమేష్‌లపై మూడు రోజుల పాటు చిత్రీకరణ చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి..

రీ షూట్‌ వల్ల సినిమా ఏమాత్రం ఆలస్యం కాకుండా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇదే సమయంలో షూటింగ్‌ కూడా చేయబోతున్నారు. సైలెంట్‌గా తెరకెక్కినా కూడా ఈ చిత్రం విడుదల సమయం ముంచుకు వస్తున్న సమయంలో అంచనాలు పెరిగాయి. మరి ఈ రిపేర్లు సినిమాపై ఉన్న అంచనాలను అందుకునేలా చేస్తాయా అనేది చూడాలి..